India vs West Indies: టీమిండియా లక్ష్యం 208 పరుగులు...చెలరేగిన విండీస్ బ్యాట్స్‌మెన్

హెట్ మెయర్ సైతం 41 బంతుల్లో 56 పరుగులు చేసి, వేగంగా పరుగులు చేశారు. అనంతరం వచ్చిన కీరన్ పోలార్డ్(37), జేసన్ హోల్డర్ (24) రెచ్చిపోవడంతో స్కోరు బోర్డు 200 దాటింది.

news18-telugu
Updated: December 6, 2019, 8:42 PM IST
India vs West Indies: టీమిండియా లక్ష్యం 208 పరుగులు...చెలరేగిన విండీస్ బ్యాట్స్‌మెన్
చెలరేగిన విండీస్ బ్యాట్స్‌మెన్ (Image: BCCI)
  • Share this:
భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 విండీస్ 207/5 భారీ స్కోరు సాధించింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా ముందుగా విండీస్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో విండీస్ జట్టు తొలివికెట్ రూపంలో ఓపెనర్ సిమ్మన్స్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం స్కోరు బోర్డును పరిగెత్తించే బాధ్యత ఎవిన్ లూయిస్(40), బ్రాండన్ కింగ్(31)పై పడింది. వీరిద్దరూ రెండో వికెట్ కు వేగంగా 24 బంతుల్లో 50 పరుగులు చేశారు. అనంతరం 64 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హెట్ మెయర్ సైతం 41 బంతుల్లో 56 పరుగులు చేసి, వేగంగా పరుగులు చేశారు. అనంతరం వచ్చిన కీరన్ పోలార్డ్(37), జేసన్ హోల్డర్ (24) రెచ్చిపోవడంతో స్కోరు బోర్డు 200 దాటింది.
Published by: Krishna Adithya
First published: December 6, 2019, 8:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading