India vs West Indies 2nd Test : జమైకాలో జరుగుతున్న ఇండియా - వెస్టిండీస్ రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. పేస్ బౌలర్ బుమ్రా మాయాజాలంతో... వెస్టిండీస్ 87 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి... మూడో రోజు ఆట ప్రారంభించినా... మరో 30 రన్స్ మాత్రమే చేసి... 117 రన్స్‌కే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఫలితంగా... టీమిండియాకి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 299 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా 47.1 ఓవర్లు వెయ్యగా... వాటిలో 36 ఓవర్లను పేసర్ల ద్వారా వేయించింది. అందువల్ల పేసర్లకు కాస్త బ్రేక్ ఇచ్చే ఉద్దేశంతో... ఫాలోఆన్‌కి ఛాన్స్ ఇవ్వకుండా... సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఐతే... స్కోర్ 9 పరుగుల దగ్గర ఐదో ఓవర్లోనే ఎల్బీడబ్ల్యూగా మయాంక్ అగర్వాల్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్కోర్ 36 పరుగుల దగ్గర కేఎల్ రాహుల్, ఆ వెంటనే విరాట్ కోహ్లీ పెవిలియన్ బాట పట్టారు. స్కోర్ 54 పరుగుల దగ్గర పుజారా వికెట్ కోల్పోయింది టీమిండియా.
మూడో రోజు టీమిండియా... 4 వికెట్లు కోల్పోయి... 168 పరుగులు చేసింది. హనుమ విహారీ, రహానే క్రీజులో ఉన్నారు. ఫలితంగా టీమిండియా 467 పరుగుల ఆధిక్యంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 468 పరుగుల లక్ష్య చేధనకు బరిలో దిగిన వెస్టిండీస్... 45 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. డార్రెన్ బ్రావో (18), షమర్ష్ బ్రూక్స్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆట నాలుగో రోజున 8వికెట్లు తీసి... త్వరగా సెకండ్ ఇన్నింగ్స్ ముగించి... సిరీస్ క్లీన్ స్వీప్ చెయ్యాలని టీమిండియా టార్గెట్‌గా పెట్టుకుంది. తద్వారా కరీబియన్ టూర్లో టీట్వంటీ, వన్డే, టెస్ట్ అన్ని సిరీస్‌లూ భారత జట్టు గెలుచుకున్నట్లవుతుంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.