India vs West Indies | నేడే విండీస్‌తో టీ 20 పోరు...ధావన్ దూరం...పంత్ పైనే మిడిలార్డర్ భారం

గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టుకు అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేసే అవకాశం ఉంది.

news18-telugu
Updated: December 6, 2019, 5:15 PM IST
India vs West Indies | నేడే విండీస్‌తో టీ 20 పోరు...ధావన్ దూరం...పంత్ పైనే మిడిలార్డర్ భారం
టీమిండియా (Image: Cricketnext )
  • Share this:
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం టీమిండియా పటిష్టంగా ఉందని టీమిండియ కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. టీ20ల్లో ర్యాంకింగ్స్ పట్టించుకోమని, పూర్తి దృష్టంతా మ్యాచ్ పైనే పెట్టామని తెలిపాడు. రిషబ్ పంత్ ప్రతిభపై జట్టుకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. మిడిల్ ఆర్డర్ లో ఎలాంటి సమస్య లేదని..రవీంద్ర జడేజా జట్టుకు ప్రధాన బలమని కోహ్లీ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టుకు అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక, గత కొంతకాలంగా విఫలమవుతూ వస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్‌పంత్‌కు మరోమారు చాన్స్ ఇచ్చారు. ఈ సిరీస్‌లో పంత్ తనను తాను నిరూపించుకోగలిగితే వచ్చే ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోగలుగుతాడు. కాబట్టి పంత్ ఈ సిరీస్‌లో సర్వశక్తులు ఒడ్డక తప్పదు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>