IND vs WI : వన్డే సిరీస్‌పై టీమిండియా కన్ను... నేడు తొలి మ్యాచ్

India vs West Indies 1st ODI : వెస్టిండీస్‌పై ఇప్పటికే 5 వన్డే సిరీస్‌లు గెలిచి... ఇటీవల టీ-ట్వంటీ సిరీస్ కూడా కొట్టేసిన టీమిండియా... ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ కూడా తమదే అంటోంది. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 15, 2019, 6:05 AM IST
IND vs WI : వన్డే సిరీస్‌పై టీమిండియా కన్ను... నేడు తొలి మ్యాచ్
IND vs WI : వన్డే సిరీస్‌పై టీమిండియా కన్ను... నేడు తొలి మ్యాచ్
  • Share this:
India vs West Indies 1st ODI : ఓవైపు టీమిండియా దూసుకుపోతున్న పరిస్థితిలో ఉంటే... మరోవైపు చతికిలపడిపోతూ నిలదొక్కుకోవడం ఎలాగో అర్థంకాని అయోమయంలో పడిపోతోంది వెస్టిండీస్ జట్టు. ఇప్పటివరకూ... వెస్టిండీస్‌పై భారత్... 9 వన్డే సిరీస్‌లను గెలిచింది. తాజా సిరీస్‌తో విజయాన్ని రౌండప్ చెయ్యాలనుకుంటోంది. టీ-ట్వంటీ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లనూ గెలవలగలమనుకున్న టీమిండియాకి... రెండో మ్యాచ్‌లో చక్కటి విజయాన్ని దక్కించుకొని... షాక్ ఇచ్చారు కరీబియన్లు. వెంటనే కోలుకున్న టీమిండియా... మూడో మ్యాచ్ గెలిచి... 2-1తో సిరీస్‌ను దక్కించుకుంది. వన్డే సిరీస్ విషయంలో మాత్రం అలా కాకుండా... మూడు మ్యాచ్‌లూ కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉంది. చెన్నైలోని చెపాక్ (చిదంబరం స్టేడియం)లో ఈ మ్యాచ్ జరగబోతోంది. మధ్యాహ్నం 1.30కి ఇది మొదలవ్వనుంది.

టీమిండియాలో అంతా బాగున్నప్పుడు పెద్దగా విశ్లేషణలు అవసరం లేదు. కోహ్లీ టీమ్ అన్ని ఫార్మాట్లలో బలంగా ఉంది. ఐతే... పొలార్డ్ టీమ్‌ని తక్కువ అంచనా వెయ్యడానికి లేదు. మొదటి మ్యాచ్‌ని గెలిచి, టీమిండియాపై ఒత్తిడి పెంచాలనే వ్యూహంతో బరిలో దిగుతోంది. ఈ మధ్యే ఆ టీమ్... ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అందువల్లే టీమిండియా పట్టు జారిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చెన్నైలో రెండ్రోజులుగా వర్షం కురుస్తున్నా... ఇవాళ మాత్రం కురిసే ఛాన్స్ లేదని తెలిపారు. అందువల్ల పరుగుల వరద పారుతుందని అనుకోవచ్చు.

భారత్‌ జట్టు అంచనా : కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, దూబే/జడేజా, దీపక్‌ చాహర్‌, రిషభ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, కుల్దీప్‌, షమి, చాహల్‌.

విండీస్‌ జట్టు అంచనా : పొలార్డ్‌ (కెప్టెన్‌), లూయిస్/బ్రాండన్‌ కింగ్‌, చేజ్‌, హెట్‌మయెర్‌, హోప్‌, పూరన్‌, కాట్రెల్‌, షెఫర్డ్‌, హోల్డర్‌, జొసెఫ్‌, హేడెన్‌ వాల్ష్‌.



 

Pics : బాలీవుడ్‌ వైపు చూస్తున్న అనుష్కా సేన్



ఇవి కూడా చదవండి :

 

ఆయేషా రీపోస్ట్‌మార్టం పూర్తి... కొత్తగా తెలిసిందేంటి?

Health : ఒరెగానో వాడుతున్నారా... కిచెన్‌లో ఇది ఉంటే ఆరోగ్యమే

Health : అవిసె గింజల డ్రింక్... తాగితే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Health : చలికాలంలో తినదగ్గ 5 రకాల ప్రోటీన్ స్నాక్స్...

Baby Names : చిన్నారికి పేరు పెట్టాలా? ఈ టిప్స్ పాటించండి
First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు