India vs West Indies: బ్రియన్ లారా రికార్డును బద్దలుకొట్టిన క్రిస్ గేల్...

గురువారం వర్షం కారణంగా వెస్టిండీస్, ఇండియా మ్యాచ్ రద్దు అయినప్పటికీ క్రిస్ గేల్ మాత్రం విండీస్ తరపున అత్యధికంగా 296 అంతర్జాతీయ వన్డే మ్యాచులు ఆడిన ఆటగాడికి రికార్డుల్లోకి ఎక్కాడు.

news18-telugu
Updated: August 9, 2019, 12:44 PM IST
India vs West Indies: బ్రియన్ లారా రికార్డును బద్దలుకొట్టిన క్రిస్ గేల్...
క్రిస్ గేల్...
  • Share this:
విండీస్ విధ్వంసక బ్యాట్స్ మ్యాన్ క్రిస్ గేల్ సరికొత్త రికార్డును అందుకున్నాడు. వెస్టిండీస్ తరపున అత్యధిక వన్డే మ్యాచులు ఆడిన లెజండరీ ఆటగాడు బ్రియన్ లారా రికార్డును బద్దలు కొడుతూ క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. గురువారం వర్షం కారణంగా వెస్టిండీస్, ఇండియా మ్యాచ్ రద్దు అయినప్పటికీ క్రిస్ గేల్ మాత్రం విండీస్ తరపున అత్యధికంగా 296 అంతర్జాతీయ వన్డే మ్యాచులు ఆడిన ఆటగాడికి రికార్డుల్లోకి ఎక్కాడు. ఇదిలా ఉంటే విండీస్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ఇతర బ్యాట్స్ మెన్లను చూస్తే బ్రియన్ లారా 295 వన్డేలు ఆడగా, చందర్ పాల్ 268, డెస్మండ్ హేన్స్ 238, వివ్ రిచర్డ్స్ 187 వన్డేలు ఆడారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా క్రిస్ గేల్ ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నాడు. వరల్డ్ కప్ లోనూ గేల్ తన ప్రభావం చూపలేకపోయాడు. 39 ఏళ్ళ గేల్ టెస్టుల్లో 103 మ్యాచులు ఆడగా, మొత్తం 58 టీ20 మ్యాచుల్లో ఆడాడు.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>