Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: September 1, 2019, 9:32 AM IST
టీమిండియా
India vs West Indies 2nd Test : జమైకాలోని సబీనా పార్క్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా, వెస్టిండీస్ రెండో టెస్టు రెండో రోజున అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా హ్యాట్రిక్ వికెట్లతో అరుదైన ఫీట్ సాధించాడు. వరుస బంతుల్లో మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ రికార్డు సృష్టించాడు. అదే సమయంలో... హనుమ విహారీ టెస్టుల్లో తొలి సెంచరీ బాదగా... టెయిలెండర్ ఇషాంత్ శర్మ తొలిసారిగా హాఫ్ సెంచరీ సాధించడంతో... మ్యాచ్ పూర్తిగా టీమిండియాకి అనుకూలంగా మారిపోయింది. ఫలితంగా టీమ్ ఇండియా... రెండో టెస్ట్... రెండో రోజు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్‌కి 416 రన్స్ చేసింది. ఓవరాల్‌గా చెప్పుకోవాల్సింది ఫాస్ట్ బౌలరైన బుమ్రా గురించే. మ్యాచ్ తొమ్మిదో ఓవర్లో రెండో బంతికి డారెన్ బ్రావో(4)... స్లిప్‌లో కేఎల్ రాహుల్ చేతికి చిక్కగా... మూడో బంతికి బ్రూక్స్(0) ఎల్బీగా పెవిలియన్ బాట పట్టాడు. నాలుగో బంతికి చేజ్(0) కూడా ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దాంతో అరుదైన రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నట్లైంది. అంతకుముందు ఏడో ఓవర్లో ఓపెనర్ క్యాంప్‌బెల్(2) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. షిమ్రాన్ హేట్మెయెర్, జాసన్ హోల్టర్ కలిసి... 45 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు. వాళ్లు సెటిలవుతున్నట్లు కనిపిస్తున్న సమయంలో... మహ్మద్ షమీ... చక్కటి స్వింగ్‌తో హేట్మెయెర్ను స్టంపవుట్ చేశాడు. తర్వాత ఫీల్డ్‌లోకి ఎంటరైన బుమ్రా... జాసన్ హోల్డర్‌ను సాగనంపాడు. ఫలితంగా వెస్టిండీస్... 86 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. హామిల్టన్, కార్న్వెల్ క్రీజ్‌లో ఉన్నారు.
నిజానికి నాలుగో బంతి చేజ్ బ్యాట్‌ను తాకిందేమోననే అనుమానంతో బుమ్రా అప్పీలు చేయలేదు. కెప్టెన్ కోహ్లీ మాత్రం బంతి ప్యాడ్‌ను తాకిందంటూ అప్పీలు చేశాడు. ఫీల్డ్ అంపైర్ ఒప్పుకోలేదు. దాంతో థర్డ్ అంపైర్‌ని కోరాడు కోహ్లీ. టీవీ స్క్రీన్‌లో బంతి చేజ్ ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. ఫలితంగా బుమ్రా అకౌంట్లో హ్యాట్రిక్ రికార్డు నమోదైంది. బుమ్రా బౌలింగ్ మ్యాజిక్ వల్ల తక్కువ రన్స్‌కే... వెస్టిండీస్ 4 వికెట్లు కోల్పోయినట్లైంది. 10 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయి... 14 పరుగులే చెయ్యగలిగింది. టెస్ట్ క్రికెట్లో ఇండియా నుంచీ ఇది మూడో హ్యాట్రిక్ రికార్డు. ఇదివరకు 2001లో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ సాధించగా... 2006లో ఇర్ఫాన్ పఠాన్... పాక్‌పై హ్యాట్రిక్ కొట్టాడు. 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ఫీట్ చేసి చూపించి... అభిమానులను సంబరాల్లో ముంచెత్తాడు బుమ్రా.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది 44వ హ్యాట్రిక్. 2017లో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ ఈ రికార్డు సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఈ ఫీట్ చేయగలిగింది బుమ్రానే. ఇదే టెస్టులో హనుమ విహారీ... తన మొదటి టెస్ట్ సెంచరీని నమోదుచేశాడు.
Published by:
Krishna Kumar N
First published:
September 1, 2019, 9:32 AM IST