IND vs WI : తొలి టెస్టులో దూకుడుగా వెస్టిండీస్... పేస్ బౌలింగ్‌తో టీమిండియాకు షాక్...

INDIA vs West Indies 1st Test : భారీ అంచనాల మధ్య తొలి టెస్టు ప్రారంభించిన టీమిండియాకు... కరీబియన్ వీరులు ఊహించని షాక్ ఇచ్చారు. పేస్ బౌలింగ్‌తో టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసి... అప్పుడే తమ ఆట అయిపోలేదని నిరూపించారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 23, 2019, 7:51 AM IST
IND vs WI : తొలి టెస్టులో దూకుడుగా వెస్టిండీస్... పేస్ బౌలింగ్‌తో టీమిండియాకు షాక్...
విరాట్ కోహ్లీ (Image : Twitter - Online-Betting-Guides)
Krishna Kumar N | news18-telugu
Updated: August 23, 2019, 7:51 AM IST
టీట్వంటీ, వన్డే సిరీస్‌లలో దుమ్మురేపిన టీమిండియా... టెస్టు సిరీస్‌లో మాత్రం అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయింది. గురువారం ప్రారంభమైన అంటిగ్వా టెస్టులో... టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కి దిన టీమిండియా... మొదటి 5 పరుగులకే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వికెట్ వదులుకుంది. షాకింగ్ విషయమేంటంటే... ఆ వెంటనే చటేశ్వర్ పుజారా కూడా జస్ట్ 2 పరుగులు మాత్రమే చేసి... వెనుదిరిగాడు. 7 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయి... అభిమానుల్లో మ్యాచ్ టెన్షన్ పెంచుతున్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ... బరిలో దిగాడు. అతను దుమ్మురేపుతాడనీ, భారీ స్కోర్ చేస్తాడనీ... అనుకున్నారు ఫాన్స్. కానీ... 12 బాల్స్‌కి 9 రన్స్ చేసిన కోహ్లీ... గాబ్రియల్ బౌలింగ్‌లో షమారా‌కి క్యాచ్ ఇచ్చి... పెవిలియన్ బాటపట్టాడు. ఆ దృశ్యం చూసిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. కోహ్లీ ఏంటి... ఇలా చేశాడేంటి... అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఓపెనర్ లోకేష్ రాహుల్ మాత్రం బాధ్యతగా ఆడాడు. అతనికి అజింక్య రహానే తోడుగా నిలిచాడు. వీళ్లిద్దరూ కలిసి... లంచ్ టైమ్‌కి స్కోర్ బోర్డ్ 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు ఉండేలా చేయగలిగారు. లంచ్ తర్వాత తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌... 93 రన్స్ దగ్గర... 44 పరుగులు చేసిన లోకేష్ రాహుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా పడుతూ లేస్తూ... టీమిండియా... డ్రింక్స్ సమయానికి 36 ఓవర్లలో 4 వికెట్లకు 97 రన్స్ చేసింది. రాహుల్ తర్వాత... బ్యాటింగ్‌కి దిగిన... హనుమ విహారీ... అజింక్య రహానేతో కలిసి... ఐదో వికెట్ పడే నాటికి అదనంగా 82 పరుగులు చేర్చారు. కాసేపటికే ఆరో వికెట్ కూడా కోల్పోవడంతో... తొలిరోజు ఆట ముగిసే సమయానికి... ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 203 పరుగులు చేసింది. రిషబ్ పత్ (20), రవీంద్ర జడేడా (3) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

వర్షానికి తోడు... పీచ్ మారిపోవడం, పేస్ బౌలింగ్ కారణంగా... పరుగుల వేటలో చతికిలపడుతున్నారు భారత ఆటగాళ్లు. లోయర్ ఆర్డర్ కూడా చేతులెత్తేస్తే... ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ది పై చేయి అయ్యే అవకాశాలున్నాయి.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...