Home /News /sports /

INDIA VS WEST INDIES 1ST TEST TEAM INDIA TO PLAY WITH WEST INDIES IN FIRST TEST WITH NEW JERSEY NK

IND vs WI : నేడు భారత్, వెస్టిండీస్ తొలి టెస్టు... ప్లేయర్లకు కొత్త జెర్సీలు

టీమిండియా న్యూ జెర్సీ (Image : Insta - tentaransports)

టీమిండియా న్యూ జెర్సీ (Image : Insta - tentaransports)

INDIA vs West Indies 1st Test : కరీబియన్ గడ్డపై దుమ్మురేపుతున్న టీమిండియా... వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. వన్డేలు, టీ-ట్వంటీ సిరీస్‌లను కైవసం చేసుకున్నట్లే... టెస్ట్ సిరీస్‌ని కూడా దక్కించుకునేందుకు సిద్ధమైంది. రాత్రి 7 గంటల నుంచి సోనీ టెన్‌లో టెస్ట్ మ్యాచ్ లైవ్ రానుంది.

ఇంకా చదవండి ...
భారత్ ఆటగాళ్లు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న టెస్ట్ సిరీస్ మరికొన్ని గంటల్లో మొదలవ్వబోతోంది. ఈ సిరీస్‌లో రాణించి... తమ ర్యాంకుల్ని మెరుగు పరచుకోవాలని ప్లేయర్లు సర్వసన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా... అంటిగ్వా వేదికగా నార్త్‌ సౌండ్‌లో సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ జరగబోతోంది. విండీస్ టూర్‌లో ఇప్పటికీ టీమిండియా... టీ20, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసింది. అదే జోరులో... తొలి టెస్టును కూడా ఐదు రోజులు కాకుండా... వీలైనంత త్వరగా ముగించేయాలనుకుంటోంది. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టులో సరైన ఆటగాళ్లు లేరు. నిలకడగా ఆడేవాళ్లు లేక ఆ జట్టు సతమతమవుతోంది. ఇదే ప్లస్ పాయింట్‌గా కోహ్లీ సేన... దూకుడు చూపించాలనుకుంటోంది. ఈ రెండు టెస్టుల సిరీస్‌ను గెలిస్తే... వెస్టిండీస్‌లో 17 ఏళ్లుగా టెస్టు సిరీస్‌లలో విజయాలు అందుకుంటున్న జట్టుగా టీమ్ ఇండియా రికార్డ్ సృష్టించినట్లవుతుంది.

కోహ్లీ ముందు రెండు రికార్డులు : ఈ టెస్ట్ సిరీస్ గెలిస్తే... విండీస్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను గెలిచిన తొలి టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. అంతే కాదు... ఈ సిరీస్‌లో గెలిస్తే... ధోనీ రికార్డును కోహ్లీ పంచుకునే ఛాన్స్ దక్కుతుంది. టెస్టుల్లో ధోని 60 మ్యాచుల్లో 27 గెలిస్తే... కోహ్లీ 46లో 26 మ్యాచులు గెలిచాడు. ఇంకొక్కటి గెలిస్తే... ధోనీ రికార్డును సమం చేస్తాడు.

భారత ఆటగాళ్లకు కొత్త జెర్సీ : టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్తగా జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు, నంబర్లకు ఐసీసీ అనుమతిచ్చింది. యాషెస్‌ తొలి టెస్టు నుంచీ ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు కొత్త జెర్సీలు ధరించాయి. ఆ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్‌ టీమ్లు కొత్త జెర్సీలతో టెస్టు క్రికెట్‌ ఆడాయి. ఇప్పుడు టీమిండియా, వెస్టిండిస్ జట్లు కూడా సరికొత్త జెర్సీలతో కనిపించనున్నాయి. భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీలు ఇవే.




టీమిండియా : విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, అజింక్యా రహానే, మయాంక్‌ అగర్వాల్‌, పుజరా, రాహుల్‌, రిషబ్‌ పంత్‌, సాహా(వికెట్‌ కీపర్‌), హనుమ విహారి, జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, ఉమేష్‌ యాదవ్‌.

వెస్టిండీస్‌ : హోల్డర్‌(కెప్టెన్‌), బ్రాత్‌వైట్‌, బ్రోక్స్‌, హెట్‌మెయిర్‌, డోవ్రిచ్‌, బ్రేవో, హోప్‌(వికెట్‌కీపర్‌), కార్న్‌వాల్‌, కీమో పాల్‌, క్యాంప్‌బెల్‌, గాబ్రియేల్‌, కీమర్‌ రోచ్‌, రోస్టన్‌ ఛేస్‌.
Published by:Krishna Kumar N
First published:

Tags: Cricket, Match, Team india, West Indies

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు