India vs Srilanka: ప్రస్తుతం టి20ల్లో టీమిండియా (Team India) జోరు మీదుంది. వరుస విజయాలతో అదరగొడుతుంది. 2021 టి20 ప్రపంచకప్ (t20 World cup)లో పాకిస్తాన్ (Pakistan), న్యూజిలాండ్ (New zealand) చేతుల్లో ఎదురైన ఓటముల తర్వాత గేర్ మార్చిన భారత్ వరుస విజయాలను సాధిస్తూ వస్తోంది. ప్రపంచకప్ లో మొదలైన విజయాలన పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అఫ్గానిస్తాన్ (Afghanistan), నమీబియా (namibia), స్కాట్లాండ్ (Scotland) జట్లను ఓడించిన భారత్... ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ , వెస్టిండీస్ (West indies), శ్రీలంక (Srilanka) జట్లను 3 0తో క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా టి20ల్లో అఫ్గానిస్తాన్, రొమేనియా జట్ల పేరిట ఉన్న అత్యధిక వరుస విజయాల రికార్డును టీమిండియా సమం చేసింది. ప్రస్తుతం ఈ మూడు జట్లు కూడా 12 వరుస విజయాలతో ఉన్నాయి.
అయితే ఈ ఘనతను చూసి మురిసి పోవద్దని టీమిండియా మాజీ సారథి సునీల్ గావస్కర్ (Sunil gacaskar) రోహిత్ (Rohit sharma) సేనను హెచ్చరించాడు. డెత్ ఓవర్ల విషయంలో మెరుగు పడాలని సూచించాడు. దాంట్లో మెరుగు పడకుంటే ఆస్ట్రేలియా (Australia) వేదికగా ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ లోనూ భారత్ రిక్త హస్తాలతో వెనక్కి రావల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లో భారత్ డెత్ (16 నుంచి 20) ఓవర్లలో భారీగా పరగులు సమర్పించుకుంది. రెండో టి20లో చివరి ఐదు ఓవర్లలో భారత్ ప్రత్యర్థికి 83 పరుగులు సమర్పించుకుంది. ఇక మూడో టి20లో ఆఖరి ఐదో ఓవర్లలో 68 పరుగులు ఇచ్చింది. డెత్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేయడంలో భారత్ దారుణంగా విఫలమైనట్లు గావస్కర్ అన్నాడు. అంతేకాకుండా శ్రీలంక బ్యాటర్లు షనక, నిసాంకలు టీమిండియాను ఎదుర్కొన్న తీరును ప్రశంసించాడు. ముఖ్యంగా రెండో టి20లో బుమ్రా బౌలింగ్ లో నిసాంక ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయని గావస్కర్ పేర్కొన్నాడు.
’ భారత్ డెత్ ఓవర్ల గురించి ఆందోళన పడాలి. తొలి 10 ఓవర్లు ఎవరు వేస్తున్నారు... చివరి ఎనిమిది ఓవర్లను ఎవరు వేస్తున్నారో అనే అంశం మీద భారత్ ఆలోచించాలి. ఇలానే డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటే వచ్చే టి20 ప్రపంచకప్ లో భారత్ కు చాలా కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాబ్లమ్ ను భారత్ ఎంత త్వరగా సాల్వ్ చేసుకుంటే అంత మంచింది‘ అని గావస్కర్ తెలిపాడు.
ఇక్కడ భారత్ మరో విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. అదేంటంటే... గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఎదురైన ఓటముల తర్వాత... టీమిండియా ఆడిన అన్ని జట్లు కూడా ఒకరకంగా పసికూనలే. ప్రపంచ కప్ లో అఫ్గాన్, నమీబియా, స్కాట్లాండ్ జట్లపై గెలిచిన భారత్... న్యూజిలాండ్, విండీస్, శ్రీలంకలపై మూడు మ్యాచ్ ల సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ న్యూజిలాండ్ బలమైన జట్టే కదా అని మీరు అనొచ్చు. టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన తర్వాత రెండు రోజులకే కివీస్ జట్టు భారత్ తో సిరీస్ ఆడింది. ఆ సమయంలో కేన్ విలియమ్సన్, బౌల్ట్ లాంటి కీలక ప్లేయర్స్ ఆడలేదు. సౌతీ నాయకత్వంలోని కివీస్ జట్టును భారత్ ఓడించింది. అలా అని భారత్ సత్తాను తక్కువ చేసి మాట్లాడలేం కూడా.. ఈసారి జరిగే టి20 ప్రపంచకప్ కు భారత్ అన్ని విధాల సన్నద్ధమైతేనే మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.