హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL 3rd T20I : శ్రేయస్ అయ్యర్ ఆన్ ఫైర్.. టీమిండియా తీన్మార్.. సిరీస్ క్లీన్ స్వీప్..

IND vs SL 3rd T20I : శ్రేయస్ అయ్యర్ ఆన్ ఫైర్.. టీమిండియా తీన్మార్.. సిరీస్ క్లీన్ స్వీప్..

Shreyas Iyer (PC : BCCI)

Shreyas Iyer (PC : BCCI)

IND vs SL 3rd T20I : వారెవ్వా శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్ లో ఇంతవరకు ఈ యంగ్ ప్లేయర్ ను శ్రీలంక బౌలర్లు ఔట్ చేయలేకపోయారు. వన్ డౌన్ లో దిగి.. ఈ సిరీస్ లో టీమిండియాకు వెన్నెముకగా నిలిచాడు శ్రేయస్.

  ధర్మశాల వేదికగా జరుగుతున్న మూడో టీ20లో కూడా టీమిండియా దుమ్మురేపింది. 147 పరుగుల టార్గెట్ ను మరో 19 బంతులు మిగిలుండగానే ఆరు వికెట్ల తేడాతో ఛేజ్ చేసింది టీమిండియా. దీంతో మరో సిరీస్ ను వైట్ వాష్ చేసింది టీమిండియా. శ్రేయస్ అయ్యర్ ( 45 బంతుల్లో 73 పరుగులు నాటౌట్ ; 9 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ కి ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ. ఈ సిరీస్ లో 204 పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యర్. ఇంతవరకు ఈ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ వికెట్ ను శ్రీలంక బౌలర్లు తీయలేకపోయారు. ఆఖర్లో జడేజా ( 16 బంతుల్లో 21 పరుగులు నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) మరోసారి ఫినిషర్ రోల్ ప్లే చేశాడు. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్ కు ఇది టీ20ల్లో వరుసగా 12 వ విజయం. దీంతో.. అఫ్గాన్ తో కలిసి సంయుక్తంగా టాప్ స్థానంలో నిలిచింది టీమిండియా. శ్రీలంక బౌలర్లలో లహీరు కుమార రెండు వికెట్లతో సత్తా చాటాడు.

  147 పరుగులతో టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలిందిటీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (9 బంతుల్లో 5) వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ విఫ‌ల‌మ‌య్యాడు. టీ20 కెరీర్ లో దుష్మంత చమీరాకి రోహిత్ వికెట్ సమర్పించుకోవడం ఇదో ఆరోసారి. ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌లో చ‌మీరా బౌలింగ్‌లో క‌రుణ‌ర‌త్నేకు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ కాసేపు స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. అయితే.. టీమిండియా ఏడో ఓవ‌ర్‌లో రెండో వికెట్ కోల్పోయింది. క‌రుణ‌ర‌త్నే బౌలింగ్‌లో వికెట్‌కీప‌ర్ చండీమాల్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంస‌న్ (12 బంతుల్లో 18; 3 ఫోర్లు) ఔట‌య్యాడు.

  ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ తో కలిసిన దీపక్ హుడా శ్రీలంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే, దూకుడుగా ఆడిన దీప‌క్ హుడా (16 బంతుల్లో 21; ఫోర్‌, సిక్స్‌) 11వ ఓవ‌ర్ ఆఖరి బంతికి ల‌హీరు కుమార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. శ్రేయస్ అయ్యర్ మాత్రం తన దూకుడు తగ్గించలేదు. 12వ ఓవ‌ర్ తొలి బంతికి భారీ సిక్స‌ర్ బాదిన శ్రేయ‌స్ అయ్య‌ర్ (29 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స‌ర్‌) సిరీస్‌లో వ‌రుస‌గా మూడో హాఫ్ సెంచ‌రీ బాదాడు. ఈ సిరీస్ లో ఇంతవరకు శ్రేయస్ అయ్యర్ ఔటవ్వకపోవడం విశేషం.

  అయితే, గత రెండు మ్యాచుల్లో బ్యాటింగ్ ఛాన్స్ దక్కించుకోని వెంకటేశ్ అయ్యర్ నిరాశపర్చాడు. లహీరు కుమార వేసిన 13వ ఓవ‌ర్‌లో జ‌య‌విక్ర‌మ‌కు క్యాచ్ ఇచ్చి వెంక‌టేశ్ అయ్య‌ర్ (4 బంతుల్లో 5) ఔట‌య్యాడు. ఆఖర్లో మరోసారి.. శ్రేయస్ అయ్యర్, జడేజా సూపర్ బ్యాటింగ్ తో టీమిండియాకు అదిరిపోయే విక్టరీ అందించారు.

  అయితే, అంతకుముందు.. కెప్టెన్ ద‌సున్ శ‌న‌క (37 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 74 నాటౌట్‌) ఒంటిరి పోరాటం చేయ‌డంతో మూడో టీ20లో లంక జ‌ట్టు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ చేయ‌గ‌లిగింది. శ‌న‌క‌కు చండీమాల్(27 బంతుల్లో 2 ఫోర్ల‌తో 25) స‌హ‌క‌రించ‌డంతో లంకేయులు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగులు చేశారు. టీమిండియా బౌల‌ర్ల‌లో ఆవేశ్ ఖాన్ 2, సిరాజ్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, ర‌వి బిష్ణోయ్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. 60 ప‌రుగుల‌కే స‌గం వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లోప‌డిన శ్రీ‌లంక‌ను ఆ జ‌ట్టు కెప్టెన్ ద‌సున్ శ‌న‌క అద్భుతంగా ఆడి అజేయ‌ హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు. ఓ దశలో శ్రీలంక స్కోరు 120 పరుగులైనా.. దాటుతుందో లేదో అనుకున్న సమయంలో షనక సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: India vs srilanka, Ravindra Jadeja, Rohit sharma, Sanju Samson, Shreyas Iyer, Team India

  ఉత్తమ కథలు