హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL 3rd T20I : టాస్ శ్రీలంకదే.. నాలుగు మార్పులతో బరిలోకి టీమిండియా..

IND vs SL 3rd T20I : టాస్ శ్రీలంకదే.. నాలుగు మార్పులతో బరిలోకి టీమిండియా..

Ind vs SL 3rd T20I

Ind vs SL 3rd T20I

IND vs SL 3rd T20I : ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అయితే, కనీసం ఆఖరి మ్యాచులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంకేయులు భావిస్తున్నారు.

    రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. విరామం లేకుండా టీమిండియా (Team India) శ్రీలంక (Sri lanka)తో మరో పోరుకు సిద్ధమైంది. అయితే, ఇది డెడ్ రబ్బర్ మ్యాచ్. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అయితే, కనీసం ఆఖరి మ్యాచులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంకేయులు భావిస్తున్నారు. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక జట్టు. ఈ మ్యాచులో నాలుగు మార్పులతో బరిలోకి టీమిండియా దిగనుంది. ఇషాన్ కిషన్, బుమ్రా, భువనేశ్వర్, చాహల్ లకి విశ్రాంతి కల్పించగా.. రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్ లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రీలంక కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. జనిత్ లియాంగే, జెఫ్రీ వాండర్సే తిరిగి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

    ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న అప్‌కమింగ్ టీ20 వరల్డ్‌కప్‌నే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు.. దానికి అనుగుణంగా రోడ్ మ్యాప్ సిద్దం చేసుకుంటుంది. ముందుగా టీమ్ కాంబినేషన్‌పై ఫోకస్ పెట్టింది. సీనియర్ ప్లేయర్స్‌ కోహ్లీ, పంత్‌కు రెస్ట్ ఇవ్వడంతో ఫస్ట్ టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగింది. రెండో టీ20లోనూ అదే టీమ్‌ను కొనసాగించింది. ఇక చివరి టీ20లో రిజర్వ్ బెంచ్ బలంతో సత్తా చాటడానికి రెడీ అయింది.

    రోహిత్ శర్మతో వెంకటేశ్ అయ్యర్ లేదా సంజూ శాంసన్ ఓపెనర్ గా ఒరిలోకి దిగవచ్చు. వరుస హాఫ్ సెంచరీలతో జోరు మీదున్న శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక బ్యాటింగ్‌లో ప్రమోషన్ అందుకున్న జడేజా టాప్5లో ఫిక్స్ అయ్యాడు. సూపర్ ఇన్నింగ్స్‌తో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆరో స్థానంలో వెంకటేశ్ అయ్యర్, ఏడో స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా బరిలోకి దిగనున్నాడు.

    మరోవైపు, శ్రీలంక జట్టు గత కొద్ది కాలంగా నిరాశజనక ప్రదర్శన చేస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టీ-20ల సిరీస్ లో 4-1 తేడాతో ఓటమి పాలైంది. అయితే, ధనాధన్ ఫార్మాట్ లో ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదు.అయితే, లంక జట్టుకు కరోనా సెగ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ వానిందు హసరంగ కరోనాతో జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు, ఫామ్ తో పాటు ఆటగాళ్ల ఫిట్ నెస్ కూడా సమస్యగా మారింది. కండరాల గాయంతో మహీశ్‌ తీక్షణ, కుశాల్‌ మెండిస్‌ సిరీస్ లోని మిగతా మ్యాచ్ లకు దూరమయ్యాడు. శ్రీలంక జట్టులో పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, దినేష్ చండిమాల్ డేంజరస్ ప్లేయర్లు.

    తుది జట్లు :

    టీమిండియా : రోహిత్ శర్మ(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, దీపక్ హుడా, హర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్.

    శ్రీలంక :పాతుమ్ నిస్సంక, ధనుష్క గుణతిలక, చరిత్ అసలంక (వైస్-కెప్టెన్), దినేష్ చండిమాల్, జనిత్ లియాంగే, దాసున్ షనక (కెప్టెన్), చామికా కరుణరత్నే, బినురో ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే, దుష్మంత చమీర, లహిరు కుమార

    Published by:Sridhar Reddy
    First published:

    Tags: India vs srilanka, Ravindra Jadeja, Rohit sharma, Shreyas Iyer

    ఉత్తమ కథలు