హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL 3rd T20I : లంకను ఆదుకున్న కెప్టెన్ షనక.. టీమిండియా ముందు ఫైటింగ్ టోటల్..

IND vs SL 3rd T20I : లంకను ఆదుకున్న కెప్టెన్ షనక.. టీమిండియా ముందు ఫైటింగ్ టోటల్..

IND vs SL 3rd T20I : లంక బ్యాట‌ర్ల‌ను భార‌త ఓపెనింగ్ బౌల‌ర్లు ప‌వ‌ర్‌ప్లేలో వ‌ణికించారు. యువ బౌల‌ర్లు మ‌హ్మ‌ద్ సిరాజ్, అవేష్ ఖాన్‌ ప‌రుగులు చేయ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంతోపాటు వ‌రుస‌గా వికెట్లు తీసి ఆ జట్టును కష్టాల్లోకి నెట్టారు. అయితే, ఆ జట్టును లంక కెప్టెన్ దసున్ షనక ఆదుకున్నాడు.

IND vs SL 3rd T20I : లంక బ్యాట‌ర్ల‌ను భార‌త ఓపెనింగ్ బౌల‌ర్లు ప‌వ‌ర్‌ప్లేలో వ‌ణికించారు. యువ బౌల‌ర్లు మ‌హ్మ‌ద్ సిరాజ్, అవేష్ ఖాన్‌ ప‌రుగులు చేయ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంతోపాటు వ‌రుస‌గా వికెట్లు తీసి ఆ జట్టును కష్టాల్లోకి నెట్టారు. అయితే, ఆ జట్టును లంక కెప్టెన్ దసున్ షనక ఆదుకున్నాడు.

IND vs SL 3rd T20I : లంక బ్యాట‌ర్ల‌ను భార‌త ఓపెనింగ్ బౌల‌ర్లు ప‌వ‌ర్‌ప్లేలో వ‌ణికించారు. యువ బౌల‌ర్లు మ‌హ్మ‌ద్ సిరాజ్, అవేష్ ఖాన్‌ ప‌రుగులు చేయ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంతోపాటు వ‌రుస‌గా వికెట్లు తీసి ఆ జట్టును కష్టాల్లోకి నెట్టారు. అయితే, ఆ జట్టును లంక కెప్టెన్ దసున్ షనక ఆదుకున్నాడు.

ఇంకా చదవండి ...

  ధర్మశాల వేదికగా జరుగుతున్న మూడో టీ20లో శ్రీలంక టీమిండియా ముందు ఫైటింగ్ టోటల్ ను సెట్ చేసింది. 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ లంకను కెప్టెన్ దసున్ షనక ఆదుకున్నాడు. దీంతో, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. కెప్టెన్ దసున్ షనక ( 38 బంతుల్లో 74 పరుగులు ; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తో లంకకు మంచి టోటల్ అందించాడు. మిగతా బ్యాటర్లు అంతగా ఆకట్టుకోలేదు. అయితే, పిచ్ పేస్ బౌలర్లకు బాగా సహకరిస్తోంది. దీంతో, టీమిండియా జాగ్రత్తగా ఆడితినే.. టార్గెట్ ఛేజ్ చెయ్యచ్చు. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ రెండు వికెట్లు, సిరాజ్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. మరో ఆఖరి ఓవర్లలో టీమిండియా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన లంకకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపారు. భారత బౌలర్ల దెబ్బకి ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయ్ ఆ జట్టుకు. లంక బ్యాట‌ర్ల‌ను భార‌త ఓపెనింగ్ బౌల‌ర్లు ప‌వ‌ర్‌ప్లేలో వ‌ణికించారు.

  యువ బౌల‌ర్లు మ‌హ్మ‌ద్ సిరాజ్, అవేష్ ఖాన్‌ ప‌రుగులు చేయ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంతోపాటు వ‌రుస‌గా వికెట్లు తీసి ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి శ్రీ‌లంక ఓపెన‌ర్ల‌తోపాటు వ‌న్‌డౌన్ బ్యాట‌ర్‌ను పెవిలియన్. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లోనే వికెట్ తీసి శ్రీ‌లంకను దెబ్బ‌కొట్టాడు. సిరాజ్ ధాటికి శ్రీ‌లంక ఓపెన‌ర్ ధనుష్క గుణతిలక డ‌కౌట్ అయ్యాడు. సిరాజ్ విసిరిన బంతిని ఆడ‌డంలో విఫ‌లమైన గుణ‌తిల‌క బౌల్డ్ అయ్యాడు. 140 కిలో మీట‌ర్ల వేగంతో వ‌చ్చిన‌ బంతి బ్యాట్‌కు తాకి మ‌రీ వికెట్ల‌ను గిరాటేసింది.

  దీంతో శ్రీ‌లంక ఒక్క ప‌రుగుకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత రెండో ఓవ‌ర్ వేసిన అవేష్ ఖాన్ కూడా లంకేయుల‌ను దెబ్బ‌కొట్టాడు. గ‌త మ్యాచ్‌లో 75 ప‌రుగుల‌తో చెల‌రేగిన శ్రీ‌లంక ఓపెన‌ర్ పాతుమ్ నిస్సాంకను ఒక్క ప‌రుగుకే ఔట్ చేశాడు. రెండో ఓవ‌ర్ ఐదో బంతిని నిస్కాంక భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించ‌గా అది గాల్లోకి లేచింది. దీంతో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న వెంక‌టేష్ అయ్య‌ర్ ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.

  ఆ త‌ర్వాత ఇన్నింగ్స్‌ నాలుగో ఓవ‌ర్‌లోనూ అవేష్ ఖాన్ విజృంభించాడు. వ‌న్‌డౌన్ బ్యాట‌ర్‌ చ‌రిత అస‌లంక‌ను 4 ప‌రుగుల‌కే ఔట్ చేశాడు. నాలుగో ఓవ‌ర్ ఆరో బంతిని భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించిన అస‌లంక బంతిని గాల్లోకి లేపాడు. ఆ బంతినిక వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ అందుకోవ‌డంతో అసలంక ఔట్ అయ్యాడు. దీంతో శ్రీ‌లంక 11 ప‌రుగుల‌కే 3 టాప్ వికెట్ల‌ు కోల్పోయి కష్టాల్లో పడింది. ప‌రుగులు కూడా రాకుండా క‌ట్ట‌డి చేయ‌డంతో ప‌వ‌ర్‌ప్లే ముగిసే స‌మ‌యానికి శ్రీలంక 3 వికెట్ల న‌ష్టానికి 16 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

  ఆ తర్వాత యువ స్పిన్న‌ర్ బిష్ణోయ్ వేసిన 9వ ఓవ‌ర్లో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. బిష్ణోయ్ విసిరిన గూగ్లి బంతికి లియ‌నాగే (19 బంతుల్లో 9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత చండీమాల్ రెండు బౌండరీలతో టచ్ లోకి వచ్చినట్టు కన్పించాడు.

  అయితే, హ‌ర్ష‌ల్ ప‌టేల్ వేసిన 13వ ఓవ‌ర్ తొలి బంతికి వెంక‌టేశ్ అయ్య‌ర్‌కు క్యాచ్ ఇచ్చి చండీమాల్ (27 బంతుల్లో 2 ఫోర్ల‌తో 25) ఔట‌య్యాడు. ఫ‌లితంగా లంక జ‌ట్టు 60 ప‌రుగుల‌కే స‌గం వికెట్లు కోల్పోయింది.అయితే, కష్టాల్లో పడ్డ ఆ జట్టును మరోసారి కెప్టెన్ దసున్ షనక ఆదుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా చెత్త బంతుల్ని బౌండరీలు తరలించి శ్రీలంకకు మంచి టార్గెట్ ను సెట్ చేశాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

  తుది జ‌ట్లు

  భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్

  శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, చరిత్ అసలంక, దినేష్ చండిమల్(వికెట్ కీప‌ర్), జనిత్ లియానాగే, దసున్ షనక (కెప్టెన్‌), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, జెఫ్రీ వాండర్సే, బినుర ఫెర్నాండో, లహిరు కుమార

  First published:

  Tags: India vs srilanka, Mohammed Siraj, Rohit sharma, Shreyas Iyer, Team India

  ఉత్తమ కథలు