హోమ్ /వార్తలు /క్రీడలు /

India vs Sri lanka: శ్రీలంకతో తొలి టెస్టు... విరాట్ కోహ్లీని ఊరిస్తోన్న దిగ్గజాల రికార్డు

India vs Sri lanka: శ్రీలంకతో తొలి టెస్టు... విరాట్ కోహ్లీని ఊరిస్తోన్న దిగ్గజాల రికార్డు

విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

India vs Sri lanka: శ్రీలంక (Sri Lanka)తో టెస్టు సిరీస్ ముంగిట భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)ని 100వ టెస్టు మ్యాచ్ రికార్డు తో పాటు మరో మైలురాయి ఊరిస్తోంది. టీమిండియా దిగ్గజ ప్లేయర్స్ సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్షణ్ లాంటి దిగ్గజ ప్లేయర్ల సరసన కోహ్లీ నిలిచే అవకాశం ఉంది

ఇంకా చదవండి ...

India vs Sri lanka: శ్రీలంక (Sri lanka)తో జరిగిన టి20 సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత (India) జట్టు... గురువారం నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం సిద్ధమవుతోంది. మొహాలి వేదికగా జరిగే ఈ టెస్టు సిరీస్ ద్వారా టీమిండియా (Team India) మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టుల్లో 100వ మ్యాచ్ ను పూర్తి చేయనున్నాడు. ఇలా టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడుతోన్న 12వ ఇండియన్ ప్లేయర్ గా కోహ్లీ ఘనతకెక్కనున్నాడు. అయితే కోహ్లీని ఈ రికార్డుతో పాటు మరో రికార్డు కూడా ఊరిస్తోంది. మొహాలిలో జరిగే తొలి టెస్టు ద్వారా విరాట్ కోహ్లీ దిగ్గజాల సరసన చేరడం ఖాయంలా కనిపిస్తోంది.

సచిన్ టెండూల్కర్ (sachin tendulkar) తర్వాత టీమిండియా రన్ మెషీన్ గా విరాట్ కోహ్లీ పేరు తెచ్చుకున్నాడు. అటు సెంచరీల పరంగా... ఇటు పరుగుల పరంగా సచిన్ రికార్డులను బద్దలు కొట్టేది కోహ్లీయే అని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే గత కొంత కాలంగా కోహ్లీ పూర్ ఫామ్ తో చెప్పుకొదగ్గ ప్రదర్శనను కనబర్చలేకపోతున్నాడు. అయితే  శ్రీలంకతో జరిగే తొలి టెస్టు ద్వారా కోహ్లీ దిగ్గజాల సరసన నిలిచే ఛాన్స్ ఉంది. టెస్టుల్లో కోహ్లీ మరో 38 పరగులు చేస్త చాలా 8 పరుగులు పూర్తి చేసిన ఆరో టీమిండియా ప్లేయర్ గా ఘనతకెక్కుతాడు. ప్రస్తుతం కోహ్లీ 7,962 పరుగులతో ఉన్నాడు. టెస్టుల్లో టీమిండియా నుంచి ఇప్పటి వరకు 8 వేల పరుగుల మైలు రాయిని సచిన్ టెండూల్కర్,  రాహుల్ ద్రవిడ్ (), సునీల్ గావస్కర్ (), వీరేంద్ర సెహ్వాగ్ (), వీవీఎస్ లక్ష్మణ్ ()లు మాత్రమే దాటారు. మరో 38 పరుగులు చేస్తే కోహ్లీ కూడా దిగ్గజాల సరసన నిలుస్తాడు.

శ్రీలంకతో జరిగే తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లోనే కోహ్లీ 38 పరుగులు చేస్తే 8 వేల పరుగుల మైలురాయిని అతి తక్కువ ఇన్నింగ్స్ లలో అందుకున్న ఐదో ప్లేయర్ గా నిలుస్తాడు. 8 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్‌కు 154 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రాహుల్‌ ద్రవిడ్‌ కు 158 ఇన్నింగ్స్‌లు,  వీరేంద్ర సెహ్వాగ్‌ 160 ఇన్నింగ్స్‌లు, సునీల్‌ గావస్కర్‌ 166 ఇన్నింగ్స్‌లు, వివిఎస్‌ లక్ష్మణ్‌ 201 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. కోహ్లీ ప్రస్తుతం 168 ఇన్నింగ్స్ లలో 7,962 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలు ఉండగా... ఏకంగా 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి.

కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

కోహ్లీ 100వ టెస్టు ముందుర కోహ్లీ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 4వ తేదీ నుంచి మొహాలి వేదికగా శ్రీలంకతో ఆరంభమయ్యే తొలి టెస్టుకు అభిమానులను స్టేడియంలోకి అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 50 శాతం ప్రేక్షకులతో మ్యాచ్ ను జరపొచ్చని తన ప్రకటనలో పేర్కొంది. టికెట్లను అన్ లైన్ లో విక్రయించనున్నట్లు పేర్కొంది. బీసీసీఐ ప్రకటనతో కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India, India vs srilanka, Sachin Tendulkar, Team India, Virat kohli

ఉత్తమ కథలు