హోమ్ /వార్తలు /sports /

India vs Sri lanka: క్రికెట్ పసికూన అఫ్గానిస్తాన్... ఇందులో మాత్రం భారత్ కంటే ముందుంది

India vs Sri lanka: క్రికెట్ పసికూన అఫ్గానిస్తాన్... ఇందులో మాత్రం భారత్ కంటే ముందుంది

India vs Sri lanka: నేడు శ్రీలంక (Sri lanka)తో జరిగే చివరి టి20 ముందు భారత్ ను ఓ రికార్డు ఊరిస్తోంది. అయితే ఈ రికార్డును క్రికెట్ పసికూన అఫ్గానిస్తాన్ హోల్డ్ చేస్తుండటం విశేషం. టి20లో టాప్ జట్లు ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా (Australia) జట్లకు సైతం సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును అఫ్గాన్ జట్టు దాదాపు మూడేళ్లుగా హోల్డ్ చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలంటే చదవండి

ఇంకా చదవండి ...

    India vs Sri lanka: అఫ్గానిస్తాన్ (Afghanistan) క్రికెట్ (cricket)లో పసికూన. ఆ జట్టు కీలక ఆటగాళ్లు రషీద్ ఖాన్ (Rashid khan), నబీ (nabi), ముజీబ్ ఉర్ రెహ్మాన్  (mujeeb ur rehman) ప్రతిభతో  టి20ల్లో సంచలన విజయాలు నమోదు చేస్తుంది. అనంతరం టెస్టు హోదాను కూడా పొంది  2018లో బెంగళూరు (bangalore)లోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా (Team India)తో తొలి టెస్టు ఆడింది. టెస్టు, వన్డేల్లో పెద్దగా సక్సెస్ కానీ ఆ జట్టు టి20ల్లో మాత్రం అదరగొడుతుంది. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నబీ లాంటి ప్లేయర్లతో ఆ జట్టు టి20ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ... గతేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ (World cup) సూపర్ 12 దశకు నేరుగా అర్హత సాధించింది. శ్రీలంక (Sri lanka), బంగ్లాదేశ్ (Bangladesh)లాంటి జట్లు సైతం గతేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ నేరుగా సూపర్ 12కు అర్హత సాధించలేపయాయి.

    టి20ల్లో అఫ్గానిస్తాన్ ను క్రికెట్ పసికూన అనలేము. తమదైన రోజున మేటి జట్లకు సైతం షాకివ్వగలదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టి20 లీగ్ లలో అఫ్గాన్ ప్లేయర్స్ ప్రధాన ఆటగాళ్లుగా ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ద్వారా రషీద్ ఖాన్ ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. ఇతడి ప్రతిభను ఎవరూ గుర్తించన రోజున సన్ రైజర్స్ హైదరాాబాద్ గుర్తించి వేలంలో కొనుగోలు చేసింది. అనంతరం అతడు ఎంతటి సక్సెస్ సాధించాడో మనందరికీ తెలిసిందే. టి20ల్లో అఫ్గాన్ జట్టు ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అదేంటంటే... ఫిబ్రవరి 5 2018 నుంచి సెప్టెంబర్ 15 2019 వరకు కూడా ఆ జట్టు వరుసగా 12 టి20 మ్యాచ్ లను నెగ్గి... ఈ ఫార్మాట్ లో అత్యధిక వరుస విజయాలు నమోదు చేసిన టీమ్ గా ఉంది. అఫ్గాన్ తో పాటు మరో పసికూన రొమేనియా (Romania)కూడా ఈ రికార్డును హోల్డ్ చేస్తోంది. రొమేనియా జట్టు అక్టోబర్ 17 2020 నుంచి సెప్టెంబర్ 5 2021 వరకు 12 వరుస విజయాలు సాధించి అఫ్గాన్ తో సంయుక్తంగా టి20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా ఉంది. అయితే రొమేనియా జట్టు ఐసీసీ (ICC)లో అసోసియేట్ టీంగా ఉంది.

    అఫ్గాన్ రికార్డుకు విజయం దూరంలో భారత్

    అఫ్గానిస్తాన్, రొమేనియా జట్ల పేరు మీద ఉన్న ఈ రికార్డును సాధించేందుకు భారత్ కేవలం ఒక విజయం దూరంలోనే ఉంది. ప్రస్తుతం భారత్ టి20ల్లో వరుసగా 11 విజయాలు సాధించింది. గతేడాది టి20 ప్రపంచకప్ ఆరంభంలో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్... అనంతరం వరుస పెట్టి విజయాలు సాధిస్తోంది. ప్రపంచ కప్ ను హ్యాట్రిక్ విజయాలతో ముగించిన భారత్... అనంతరం కొత్త సారథి రోహిత్ శర్మ (Rohit sharma) నాయకత్వంలో న్యూజిలాండ్ పై మూడు... వెస్టిండీస్ పై మూడు విక్టరీలను నమోదు చేసింది. తాజగా శ్రీలంకతో జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో తొలి రెండు విజయాలు నమోదు చేసి వరుస విజయాల సంఖ్యను 11కు చేర్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత్... మరో అసోసియేట్ నేషన్ ఉగాండతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఉగాండ కూడా వరుసగా 11 విజయాలను నమోదు చేసింది. నేడు శ్రీలంకతో జరిగే మూడో టి20లో భారత్ గెలిస్తే... ఈ ఫార్మాట్ లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా... అఫ్గాన్, రొమేనియా జట్ల సరసన చేరుతుంది.

    First published: