హోమ్ /వార్తలు /క్రీడలు /

India vs Sri lanka: హమ్మయ్యా.. ఎట్టకేలకు క్రికెట్ పసికూనలు అఫ్గాన్, రొమేనియా రికార్డులను అందుకున్నాం

India vs Sri lanka: హమ్మయ్యా.. ఎట్టకేలకు క్రికెట్ పసికూనలు అఫ్గాన్, రొమేనియా రికార్డులను అందుకున్నాం

India vs Sri lanka: టి20 ఫార్మాట్ లో పసికూనలైనా సరే కొన్ని జట్లు అద్భుత ప్రదర్శనతో సంచలనాలు నమోదు చేస్తాయి. ఆ కోవలోకే అఫ్గానిస్తాన్, రొమేనియా జట్లు వస్తాయి. పటిష్ట జట్టయిన ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా (Australia) భారత్ లాంటి వాటికి సాధ్యం కాని ఓ రికార్డును ఈ రెండు కూన జట్లు తమ పేరిట ఎప్పుడో లిఖించుకున్నాయి. అయితే తాజాగా ఆ రికార్డును భారత్ సమం చేసింది. అదేంటో తెలుసుకోవాలంటే చదవండి

ఇంకా చదవండి ...

India vs Sri lanka: టి20 మ్యాచ్ అంటేనే ధనాధన్ షాట్లు. కేవలం 40 ఓవర్లలో మ్యాచ్ ఫలితం తేలుతుంది. అదే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తే 5 ఓవర్లలోనే ఫలితం వచ్చే పరిస్థితులు ఉంటాయి. అందుకే రెగ్యులర్ ఫార్మాట్లు అయిన టెస్టు (Test), వన్డే (One day) మ్యాచ్ లకు భిన్నంగా టి20లు జరుగుతాయి. ఐదు రోజుల పాటు జరిగే టెస్టుల్లో కానీ, రోజంతా జరిగే వన్డే మ్యాచ్ లోనూ ఫేవరెట్లు ఉంటారు. అలాగే టాప్ జట్లకు గెలిచే అవకాశాలు ఉంటాయి. అయితే టి20ల్లో మాత్రం అలా కాదు. ఫేవరెట్స్ అంటూ ఎవరూ ఉండరు. ఆ 40 ఓవర్ల ఆటలో ఎవరు బాగా ఆడితే వారే విజేతగా నిలుస్తారు. అందుకే టి20ల్లో సంచలన ఫలితాలు నమోదవుతాయి. 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచ కప్ (world cup) లో పసికూన జింబాబ్వే (Zimbabwe) పటిష్ట ఆస్ట్రేలియా (Australia)ను ఓడించడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

టి20ల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేందుకు కేవలం 2 ఓవర్లు చాలు. అందుకే క్రికెట్ పసికూనలు సైతం ఈ ఫార్మాట్ లో అబ్బుర పరుస్తుంటాయి. ఈ కోవలోకే వస్తాయి క్రికెట్ కూనలు అఫ్గానిస్తాన్ (Afghanistan), రొమేనియా (Romania) జట్లు. ఈ రెండు జట్లు కూడా టి20ల్లో అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకున్నాయి. అదేంటంటే ఈ ఫార్మాట్ లో అత్యధిక వరుస విజయాలు నమోదు చేసిన జట్లుగా ఈ రెండు ఉన్నాయి.  ఫిబ్రవరి 5 2018 నుంచి సెప్టెంబర్ 15 2019 వరకు కూడా అఫ్గాన్ జట్టు వరుసగా 12 టి20 మ్యాచ్ లను నెగ్గి... ఈ ఫార్మాట్ లో అత్యధిక వరుస విజయాలు నమోదు చేసిన టీమ్ గా ఉంది. అనంతరం రొమేనియా జట్టు అక్టోబర్ 17 2020 నుంచి సెప్టెంబర్ 5 2021 వరకు 12 వరుస విజయాలు సాధించి అఫ్గాన్ తో సంయుక్తంగా టి20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. అయితే రొమేనియా జట్టు ఐసీసీ (ICC)లో అసోసియేట్ టీంగా ఉంది. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా (Team India) చేరింది. కాస్త లేటయినా సరే సూపర్ డూపర్ విజయంతో ఈ రెండు కూనల సరసన నిలిచింది.

శ్రీలంక (Sri lanka)తో ఆదివారం జరిగిన మూడో టి20 వరకు కూడా భారత్ టి20ల్లో వరుసగా 11 విజయాలు సాధించింది. గతేడాది టి20 ప్రపంచకప్ ఆరంభంలో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్... అనంతరం వరుస పెట్టి విజయాలు సాధిస్తోంది. ప్రపంచ కప్ ను హ్యాట్రిక్ విజయాలతో ముగించిన భారత్... అనంతరం కొత్త సారథి రోహిత్ శర్మ (Rohit sharma) నాయకత్వంలో న్యూజిలాండ్ పై మూడు... వెస్టిండీస్ పై మూడు విక్టరీలను నమోదు చేసింది. తాజగా శ్రీలంకతో జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో తొలి రెండు విజయాలు నమోదు చేసి వరుస విజయాల సంఖ్యను 11కు చేర్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం భారత్... మరో అసోసియేట్ నేషన్ ఉగాండతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. తాజాగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మూడో టి20లో భారత్ 6 వికెట్లతో విజయం సాధించడం ద్వారా టి20ల్లో వరుసగా 12వ గెలుపును సొంతం చేసుకుంది. ఫలితంగా ఈ ఫార్మాట్ లో అత్యధిక వరుస విజయాలు సాధించిన అఫ్గాన్, రొమేనియా జట్ల సరసన చేరింది.

First published:

Tags: Afghanistan, Australia, India vs srilanka, Team India, World cup

ఉత్తమ కథలు