హోమ్ /వార్తలు /క్రీడలు /

India vs Srilanka: తొలి టెస్టులో అదరగొట్టిన టీమిండియా... మూడో రోజే శ్రీలంక ఆట కట్టించేశారు

India vs Srilanka: తొలి టెస్టులో అదరగొట్టిన టీమిండియా... మూడో రోజే శ్రీలంక ఆట కట్టించేశారు

టీమిండియా (PC: BCCI)

టీమిండియా (PC: BCCI)

India vs Srilanka: శ్రీలంక (Sri lanka)తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా (Team India) ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. రోహిత్ నాయకత్వంలోని టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది.

India vs Srilanka: శ్రీలంక (Sri lanka)తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా (Team India) అదరగొట్టింది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్ ను మూడో రోజే ముగించింది. బౌలింగ్ లో రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అదరగొట్టడంతో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగులతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 108/4 మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో మెరిశాడు. నిసాంక 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీలంక ఫాలో ఆన్ స్కోరును దాటకపోవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)... లంకేయులను ఫాలో ఆన్ ఆడించాడు. ఇక్కడ కూడా రవీంద్ర జడేజా, అశ్విన్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగడంతో శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకు ఆలౌటైంది. నిరోషన్ డిక్ వెల్లా (81 బంతుల్లో 51 నాటౌట్; 9 ఫోర్లు) శ్రీలంక తరఫున ఒంటరి పోరాటం చేశాడు. రోహిత్ తన విజయాల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాడు. రోహిత్ కు కెప్టెన్ గా ఇది తొలి విక్టరీ కావడం విశేషం.

ఫాలో ఆన్ మొదలు పెట్టిన శ్రీలంకను టీమిండియాను స్పిన్నర్ అశ్విన్ దెబ్బ తీశాడు. ఓపెనర్ లహిరు తిరుమన్నె (0)ను అవుట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. మరి కాసేపటికే తొలి ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీ చేసిన నిసాంక (6)ను అవుట్ చేసి టీమిండియాకు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇక్కడి నుంచి టీమిండియా వెనుదిరిగి చూసుకోలేదు.  సారథి దిముత్ కరుణ రత్నే (27; 6 ఫోర్లు), మ్యాథ్యూస్ (28; 2 ఫోర్లు, 1 సిక్స్), ధనంజయ డిసిల్వా (30; 5 ఫోర్లు), చరిత్ అసలంక (20; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించారు. అయితే ఎప్పుడైతే జడేజా బంతిని అందుకున్నాడో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. పిచ్ స్పిన్ కు సహకరిస్తుండటంతో జడేజా చెలరేగిపోయాడు. మ్యాథ్యూస్, ధనంజయ వికెట్లను తీసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు.

డిక్ వెలా పోరాటం వృధా

ఓ వైపు వికెట్లు పడుతున్నా డిక్ వెలా (81 బంతుల్లో 51 నాటౌట్; 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. టెయిలెండర్లతో కలిసి శ్రీలంక తరఫున పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న ప్లేయర్లు డిక్ వెలాకు సహకరించలేదు. చూస్తుండగానే శ్రీలంక తొమ్మిది వికెట్లను కోల్పోయి ఓటమికి చేరువగా నిలిచింది. అయితే డిక్ వెలా ఆఖరి బ్యాటర్ లహిరు కుమార (4)తో పోరాటం చేశాడు. గాయంతో బాధపడుతున్నా లహిరు కుమార గొప్ప పోరాటమే చేశాడు. అయితే అశ్విన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన అతడు మొహమ్మద్ షమీ చేతికి చిక్కడంతో మ్యాచ్ ముగిసిపోయింది. సెంచరీతో పాటు 9 వికెట్లు తీసిన జడేజా ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‘గా నిలిచాడు.

First published:

Tags: India, India vs srilanka, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rohit sharma, Sri Lanka, Team India

ఉత్తమ కథలు