హోమ్ /వార్తలు /క్రీడలు /

India vs Sri lanka : శ్రీలంకపై గెలుపు... పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా

India vs Sri lanka : శ్రీలంకపై గెలుపు... పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా

India vs Sri lanka : సొంత దేశంలో భారత క్రికెట్ జట్టు జోరు మీదుంది. మన దేశంలో సిరీస్ ఆడేందుకు వచ్చే జట్టును చావు దెబ్బ తీసి కానీ వారి దేశానికి పంపడం లేదు. ముఖ్యంగా రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీం మరింత దూకుడుగా ఉంది. అటు ప్రయోగాలు చేస్తూనే ప్రత్యర్థిని పడగొడుతున్నారు. తాజగా శ్రీలంకపై మూడో టి20లో నెగ్గడం ద్వారా భారత్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అదేంటో తెలియాలంటే చదవండి

ఇంకా చదవండి ...

  India vs Sri lanka : ప్రస్తుతం రోహిత్ శర్మ (Rohit sharma) కెప్టెన్సీలోని టీమిండియా (Team India)ను ఓడించడం ఎవరి వల్లా కావడం లేదు. విరాట్ కోహ్లీ (Virat kohli) నుంచి కెప్టెన్సీ తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ ఏ జట్టుపైనా కూడా ’తగ్గేదే లే‘ అంటున్నాడు. గతేడాది న్యూజిలాండ్ (New zealand)పై 3 0తో టి20 సిరీస్ ను నెగ్గిన భారత్... ఈ ఏడాది మొదట్లో వెస్టిండీస్ (West Indies)కు చుక్కులు చూపించింది. మొదట వన్డేలను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన... అనంతరం టి20 సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసి విండీస్ ను వైట్ వాష్ చేసి వారి దేశానికి పంపింది. తాజాగా మన దేశంలో పర్యటించడానికి వచ్చిన శ్రీలంక (Sri lanka)ను సైతం వదల్లేదు. తాజాగా మూడో టి20లోనూ విజయం సాధించడంతో లంకేయులను 3 0తో క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ అండ్ కో పాకిస్తాన్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డను బద్దలు కొ ట్టంది. అదేంటో తెలుసుకోవాలంటే చదవండి

  శ్రీలంకతో జరిగిన మూడో టి20లో భారత్ 6 వికెట్లతో గెలిచి మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను 3 0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారత్ టి20 చరిత్రలో ఓ ఘనమైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.  మూడో టి20లో విజయం సాధించడం ద్వారా అంతర్జాతీయ టి20ల్లో శ్రీలంకపై భారత్ కు ఇది 17వ గెలుపు. ఈ విజయంతో టి20ల్లో ఒక జట్టుపై అత్యధిక విక్టరీలు సాధించిన టీంగా భారత్ రికార్డు సృష్టించింది. గతంలో పాకిస్తాన్ (Pakistan) పేరిట ఈ రికార్డు ఉండేది. ఆ జట్టు జింబాబ్వే (Zimbabwe)పై 16 విజయాలు సాధించింది. ఆదివారం జరిగిన మూడో టి20లో భారత్ గెలవడం ద్వారా పాకిస్తాన్ రికార్డు బద్దలై ఆ రికార్డు కాస్తా మన టీం ఖాతాలో చేరుకుంది.

  తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. భారత పేసర్ల దెబ్బకు శ్రీలంక ఒక దశలో 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును కూడా దాటడం కష్టంగా కనిపించింది. అయితే కెప్టెన్ దాసున్ షనక్ (38 బంతుల్లో74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. మరో ఎండ్ లో చమిక కరుణరత్నే (19 బంతుల్లో 12 నాటౌట్) సహకారం అందించాడు. వీరు  అభేద్యమైన ఆరో వికెట్ కు 86 పరుగులు జోడించడంతో శ్రీలంక 150 పరుగుల మార్కుకు చేరువగ వచ్చింది. ఇక ఛేదన మొదలు పెట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (5) పరుగులకే అవుటవ్వగా... మరో ఓపెనర్ సంజూ సామ్సన్ (12 బంతుల్లో 18; 3 ఫోర్లు)తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో అయ్యర్ మరో అర్ధ సెంచరీ సాధించాడు. 45 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయ్యర్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు ఒక సిక్సర్ ఉండటం విశేషం. దీపక్ హుడా (21; ఫోర్, సిక్స్) ఫర్వాలేదనిపించాడు. సామ్సన్, హుడా, వెంకటేశ్ అయ్యర్ (5) అవుటైనా... రవీంద్ర జడేజా (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ను ముగించేశాడు. శ్రేయస్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.

  First published:

  Tags: India vs srilanka, New Zealand, Rohit sharma, Team India, Virat kohli, West Indies

  ఉత్తమ కథలు