Home /News /sports /

INDIA VS SRI LANKA TEAM INDIA BECOME THE FIRST TEAM TO WIN MORE T20 MATCHES AT HOME SURPASSED PREVIOUS RECORD HOLDER NEW ZEALAND SJN

India vs Sri lanka: వారెవ్వా టీమిండియా... మీ దెబ్బకు కివీస్ రికార్డు కూడా గల్లంతాయే!

టీమిండియా (క్రెడిట్ బీసీసీఐ)

టీమిండియా (క్రెడిట్ బీసీసీఐ)

India vs Sri lanka: రోహిత్ శర్మ (Rohit sharma) నాయకత్వంలోని టీమిండియా (Team India) అంతర్జాతీయ టి20ల్లో రికార్డుల మీద రికార్డులను సాధిస్తోంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఎదురైన వైఫల్యం తర్వాత భారత జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొడుతుంది. ఈ ఏడాది చివర్లో టి20 ప్రపంచ కప్ ఉండటంతో భారత జట్టు అందుకోసం ఇప్పటి నుంచే ప్లేయర్లను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఓ రికార్డును సాధించింది. అదేంటో తెలుసుకోవాలంటే చదవండి

ఇంకా చదవండి ...
    India vs Sri lanka: రోహిత్ శర్మ (Rohit sharma) కెప్టెన్సీలోని టీమిండియా (Team India) స్వదేశంలో బెబ్బులిలా గర్జిస్తోంది. సిరీస్ లు ఆడేందుకు భారత దేశంలో అడుగు పెట్టిన ప్రతీ జట్టును ఓడిస్తూ జోరు మీదుంది. ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా (Australia) వేదికగా జరిగే టి20 ప్రపంచ కప్ (World cup) కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలు పెట్టిన భారత జట్టు...  వరుస విజయాలతో ఆ దిశగా అడుగులు వేస్తోంది.  గతేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ ద్వారా పాఠాలు నేర్చుకున్న మన టీం.. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ (rahul dravid)... కొత్త సారథి రోహిత్ శర్మల కలయికలో అదరగొడుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ (new zealand), వెస్టిండీస్ (west indies)లన మట్టికరిపించిన భారత్... తాజగా ఆదివారం జరిగిన మూడో టి20లో కూడా శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో టి20ల్లో మరో రికార్డును సొంతం చేసుకుంది.

    సొంత గడ్డపై ఏ జట్టుకైనా అనుకూలత ఉంటుంది. అలవాటైన పిచ్ లతో పాటు సొంత అభిమానుల మధ్య మ్యాచ్ ఆడుతుండటంతో స్వదేశంలో ఎప్పటికీ హోం కంట్రీకి సానుకూలత ఉంటుంది. దాంతో విదేశాలతో పోలిస్తే స్వదేశంలో ఎక్కువ విజయాలను నమోదు చేస్తూ ఉంటుంది. తాజాగా భారత్ కూడా అటువంటి ప్రదర్శనే చేసింది. అంతర్జాతీయ టి20ల్లో స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన మూడో టి20లో విజయం సాధించడం ద్వారా... భారత్ స్వదేశంలో 40వ టి20 మ్యాచ్ ను నెగ్గింది. ఈ క్రమంలో టి20 ఫార్మాట్ లో హోం కంట్రీలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట 39 మ్యాచ్ లతో ఉండగా... శ్రీలంకతో జరిగిన రెండో టి20లో విజయం సాధించడం ద్వారా ఆ రికార్డును సమం చేసింది. తాజాగా మూడో టి20లో నెగ్గడం ద్వారా కివీస్ జట్టు రెండో స్థానానికి పడిపోయింది.

    ఇక ఆదివారం జరిగిన మూడో టి20లో భారత్ 6 వికెట్లతో శ్రీలంకపై విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులను భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్ లు బెంబేలెత్తించారు. సిరాజ్ ఆరంభ ఓవర్లోనే గుణతిలకను అవుట్ చేస్తే... అవేశ్ ఖాన్ అద్భుత స్పెల్ తో అదరగరొట్టాడు. వరుసగా మూడు ఓవర్లు వేసిన అవేశ్ ఖాన్ కేవలం నాలుగు పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడీన్ ఉండటం విశేషం. అయితే అయితే కెప్టెన్ దాసున్ షనక్ (38 బంతుల్లో74 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. మరో ఎండ్ లో చమిక కరుణరత్నే (19 బంతుల్లో 12 నాటౌట్) సహకారం అందించాడు. వీరు  అభేద్యమైన ఆరో వికెట్ కు 86 పరుగులు జోడించారు. దాంతో శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఇక ఛేదన మొదలు పెట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (5) పరుగులకే అవుటవ్వగా... మరో ఓపెనర్ సంజూ సామ్సన్ (12 బంతుల్లో 18; 3 ఫోర్లు)తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో అయ్యర్ మరో అర్ధ సెంచరీ సాధించాడు. 45 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయ్యర్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు ఒక సిక్సర్ ఉండటం విశేషం. దీపక్ హుడా (21; ఫోర్, సిక్స్) ఫర్వాలేదనిపించాడు. సామ్సన్, హుడా, వెంకటేశ్ అయ్యర్ (5) అవుటైనా... రవీంద్ర జడేజా (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ను ముగించేశాడు. శ్రేయస్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
    Published by:N SUJAN KUMAR REDDY
    First published:

    Tags: India vs srilanka, New Zealand, Rahul dravid, Rohit sharma, Team India, West Indies, World cup

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు