హోమ్ /వార్తలు /క్రీడలు /

India vs sri lanka: ’కెప్టెన్ గా రోహిత్ శర్మలో నాకు నచ్చేది అదే‘... శ్రేయస్ అయ్యర్

India vs sri lanka: ’కెప్టెన్ గా రోహిత్ శర్మలో నాకు నచ్చేది అదే‘... శ్రేయస్ అయ్యర్

India vs sri lanka:  శ్రీలంక (Srilanka)తో జరిగిన మూడు టి20 మ్యాచ్ ల్లో మెరుపులు మెరిపించిన భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreya Iyer) రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో తెలుసుకోవాలంటే పూర్తి వార్తను చదవండి

ఇంకా చదవండి ...

India vs sri lanka: శ్రీలంక (Srilanka)తో ఇటీవలె ముగిసిన మూడు టి20ల్లోనూ యువ టీమిండియా (Team India) బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Sheya Iyer) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మూడు టి20ల్లోనూ వరుస పెట్టి అర్ధ సెంచరీలు చేశాడు. ఆ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ ను ప్రత్యర్థి బౌలర్లు ఒక్కసారి కూడా అవుట్ చేయలేకపోయారు. దీన్ని బట్టే తెలుస్తుంది ప్రస్తుతం అతడు ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో అని.  విరాట్ కోహ్లీ (Virat kohli), రిషభ్ పంత్ (Rishabh pant)లకు శ్రీలంక (Srilanka)తో జరిగిన ఆఖరి టి20 మ్యాచ్ లకు విశ్రాంతినివ్వడంతో సిరీస్ లో శ్రేయస్ బాధ్యత మరింతగా పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మిడిలార్డర్ బాధ్యత మొత్తం శ్రేయస్ అయ్యర్ భుజాలపై పడింది. శ్రేయస్ కూడా తనపై ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ ల్లోనూ అదిరే ప్రదర్శన కనబరిచాడు. తొలి టి20లో 57 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు... ఆ తర్వాత జరిగిన రెండు వరుస టి20ల్లోనూ 74, 73 పరుగులతో సిరీస్ లో ఏకంగా 204 పరుగులు చేసి ’ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‘గా నిలిచాడు. తాజాగా అతడు రోహిత్ శర్మపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

పూర్తి స్థాయిలో కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న తర్వాత రోహిత్ శర్మ వరుస విజయాలతో జోరు మీద కనిపిస్తున్నాడు. బరిలోకి దిగిన ప్రతి గేమ్ ను విజయంతో ముగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశంలోని ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేయస్ రోహిత్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు.

’కెప్టెన్ గా రోహిత్ శర్మ అద్బుతం. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతడు తన కోణంలో నుంచే కాకుండా మిగిలిన ప్లేయర్ల పాయింట్ ఆప్ వ్యూ నుంచి కూడా ఆలోచిస్తాడు. అలా ఆలోచించగలిగే మైండ్ సెట్ రోహిత్ లో ఉంది. అందువల్లే అతడు మిగిలిన ప్లేయర్స్ నుంచి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టుకోగలుగుతున్నాడు. రోహిత్ కెప్టెన్సీలో నాకు నచ్చేది అదే.  అంతే కాకుండా సహాయక సిబ్బంది, కోచ్ ల నుంచి కూడా తనకు కావల్సినది రోహిత్ రాబట్టుకోగలుగుతున్నాడు. అంతేకాకుండా దేశవాళీ టోర్నీల్లో మేమిద్దరం కలిసి ఓకే జట్టుకు ఆడాం. దాంతో రోహిత్ గురించి నాకు బాగా తెలుసు‘ అని రోహిత్ కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

టి20 సిరీస్ ముగియడంతో భారత జట్టు మార్చి నాలుగు నుంచి మొహాలీ వేదికగా ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం రెడీ అవుతోంది. గత కొన్నేళ్లుగా జట్టుకు మూలస్థంభంగా ఉన్న చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు శ్రీలంక తో జరిగే టెస్టు సిరీస్ కు ఎంపికవ్వలేదు. దాంతో రహానే ప్లేస్ శ్రేయస్ అయ్యర్ దాదాపుగా భర్తీ చేసే అవకాశం ఉంది.

First published:

Tags: India vs srilanka, Rohit sharma, Shreyas Iyer, Srilanka, Virat kohli

ఉత్తమ కథలు