INDIA VS SRI LANKA TEAM INDIA ALL ROUNDER RAVINDRA JADEJA SPEAKS ABOUT ROHIT SHARMA INNINGS DECLARETION CALL AGAINST SRI LANKA SJN
India vs Sri lanka first test: డబుల్ సెంచరీ మిస్ అవ్వడంపై జడేజా షాకింగ్ కామెంట్స్.. అందుకే అలా చేశామంటూ వివరణ
రవీంద్ర జడేజా (ఫైల్ ఫోటో)
India vs sri lanka: శ్రీలంక ()తో జరుగుతోన్న తొలి టెస్టులో జడేజా 175 పరుగులతో బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో రోహిత్ శర్మ () భారత తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కావాలనే జడేజాను డబుల్ సెంచరీ చేయకుండా చేశారని... ఇదంతా కోచ్ ద్రవిడ్ పనే అంటూ సోషల్ మీడియాలో జడేజా అభిమానులు పోస్ట్ లు పెట్టారు. దీనిపై జడేజా స్పందించాడు. అతడేమన్నాడో తెలుసుకోవడానికి చదవండి
India vs Sri lanka first test: టెస్టుల్లో డబుల్ సెంచరీ చేయడం చాలా అరుదైన విషయం. అందులోనూ బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడో ఆరు, ఏడు స్థానాల్లో వచ్చి డబుల్ సెంచరీ సాధించడం ఇంకా అరుదు. అయితే శ్రీలంక (Sri lanka)తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత (India) స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)కు డబుల్ సెంచరీ చేసే అవకాశం వచ్చింది. 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రవీంద్ర జడేజా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. డబుల్ సెంచరీకి కేవలం 25 పరుగుల దూరంలో నిలిచాడు. ఆ సమయంలో జడేజా బ్యాటింగ్ ను చూస్తే మరో రెండు లేదా మూడు ఓవర్లలో డబుల్ సెంచరీని అందుకునేలా కనిపించాడు. అయితే సరిగ్గా అదే సమయంలో రోహిత్ శర్మ (Rohit Sharma) తీసుకున్న ఓ నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్ గురి చేసేలా కనిపించింది. జడేజా డబుల్ సెంచరీకి సమీపంలో ఉన్న సమయంలో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తూ రోహిత్ నిర్ణయం తీసుకున్నాడు. దాంతో పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)లపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. ఇదంతా రాహుల్ ద్రవిడే వెనుక ఉండి చేయించాడంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ పెట్టారు. 2004లో సచిన్ డబుల్ సెంచరీ మిస్ అయిన సంఘటనతో ముడి పెట్టారు. ద్రవిడ్ వల్ల అప్పుడు సచిన్ టెండూల్కర్ (sachin tendulkar) డబుల్ సెంచరీని మిస్ చేసుకోగా... ఇప్పుడు జడేజా అంటూ పోస్ట్ లు పెట్టారు.
అయితే తాజాగా దీనిపై జడేజా స్పందించాడు. ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడంలో రోహిత్, రాహుల్ ద్రవిడ్ ల పాత్ర లేదని తెలిపాడు. తానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయవల్సిందిగా... కెప్టెన్ రోహిత్ కు సూచించానని జడేజా పేర్కొన్నాడు. ’నేను బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ పై బౌన్స్ ఉంది. అంతేకాకుండా బంతులు టర్న్ అవుతున్నాయి. దాంతో శ్రీలంకను బ్యాటింగ్ కు దింపితే మేం త్వరత్వరగా వికెట్లను సాధించగలమని భావించాను. అందుకే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయవల్సిందిగా రోహిత్ కు సందేశం అందించాను. అంతేకాకుండా శ్రీలంక ప్లేయర్స్ గత రెండు రోజులగా ఫీల్డింగ్ చేస్తూ అలసిపోయారు. దాంతో వాళ్లకు బ్యాటింగ్ చేసే సమయంలో షాట్స్ ఆడటం అంత తేలికైన విషయం కాదు. అందులోనూ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తోంది. ఈ కారణాలతో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయమని చెప్పా‘ అని డబుల్ సెంచరీ వివాదానికి జడేజా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.
భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 8 వికెట్లకు 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత రెండో తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన శ్రీలంక ను 65 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ చేసింది. పాతుమ్ నిసాంక 61 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీంలో అతడే టాప్ స్కోరర్ కావడం విశేషం. శ్రీలంక ఫాలో ఆన్ స్కోర్ ను కూడా దాటలేకపోవడంతో... సారథి రోహిత్ శ్రీలంకను ఫాలో ఆన్ ఆడాల్సిందిగా కోరాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.