హోమ్ /వార్తలు /క్రీడలు /

India vs Sri lanka: మరీ అంత పరధ్యానంగా ఉంటే ఎలా ఫెర్నాండో... చూడు ఈజీ రనౌట్ ను ఎలా వదిలేశావో...

India vs Sri lanka: మరీ అంత పరధ్యానంగా ఉంటే ఎలా ఫెర్నాండో... చూడు ఈజీ రనౌట్ ను ఎలా వదిలేశావో...

రనౌట్ చాన్స్ ను మిస్ చేస్తున్న విశ్వ ఫెర్నాండో

రనౌట్ చాన్స్ ను మిస్ చేస్తున్న విశ్వ ఫెర్నాండో

India vs Sri lanka: భారత్ (India)తో జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో శ్రీలంక పేసర్ విశ్వ ఫెర్నాండో కామెడీ చేశాడు. తన పరధ్యానంతో ఈజీ రనౌట్ ను మిస్ చేశాడు. ఎంత ఈజీ రనౌట్ అంటే క్రికెట్ చరిత్రలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా సంభవిస్తాయి. రనౌట్ ఎలా మిస్ చేశాడో మీరూ చూసేయండి మరీ...

ఇంకా చదవండి ...

India vs Sri lanka: తొలి రోజు రిషభ్ పంత్ (Rishabh Pant) దెబ్బకు విలవిల్లాడిన శ్రీలంక (Sri lanka) రెండో రోజు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) బ్యాటింగ్ దెబ్బకు బెంబేలెత్తింది. ముఖ్యంగా బౌలర్ విశ్వ ఫెర్నాండో... అతడు వన్డేల్లో మాదిరి 5కు పైగా ఎకానమితో పరుగులు సమర్పించుకున్నాడు. అయితే రెండో రోజైన శనివారం ఆటలో ఓ గమ్మత్తైన విషయం చోటు చేసుకుంది. పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed shami)తో కలిసి జడేజా లంకేయులపై చెలరేగుతున్న వేళ... విశ్వ ఫెర్నాండో చేసిన ఓ పని అందరినీ నవ్వించేలా చేసింది. తన పరధ్యానంతో సింపుల్ రనౌట్ ను అతడు కామెడీగా మార్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే...

భారత్ బ్యాటింగ్ సాఫీగా సాగుతోన్న వేళ ఇన్నింగ్స్ 125వ ఓవర్ ను వేయడానికి విశ్వ ఫెర్నాండో వచ్చాడు. ఆ ఓవర్ లో విశ్వ ఫెర్నాండో వేసిన ఓ బంతిని జడేజా మిడ్ వికెట్ దిశలో ఆడాడు. వెంటనే ఒక పరుగును పూర్తి చేసిన అతడు... రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్ వికెట్ దగ్గర ఉన్న ఫీల్డర్ బంతిని అందుకోవడంతో... రెండో పరుగును మధ్యలోనే ఆపేసిన జడేజా పిచ్ మధ్యలో నుంచి నాన్ స్ట్రయికింగ్ ఎండ్ వైపు వచ్చేశాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న షమీ మాత్రం రెండో పరుగు కోసం నాన్ స్ట్రయికింగ్ ఎండ్ వైపు వచ్చేశాడు. దాంతో జడేజా, షమీలు ఇద్దరు కూడా నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్నారు. ఇదే సమయంలో ఫీల్డర్ నాన్ స్ట్రయికింగ్ ఎండ్ వైపుకు త్రో చేశాడు. అక్కడే ఉన్న విశ్వ ఫెర్నాండో బంతిని అందుకొని స్ట్రయికింగ్ ఎండ్ వైపు విసిరి ఉంటే షమీ ఈజీగా రనౌట్ అయ్యేవాడు. ఇక్కడే ఫెర్నాండో పరధ్యానం సింపుల్ రనౌట్ ను కామెడీ చేసింది. ఫీల్డర్ విసిరిన బంతిని అందుకోలేకపోయానే అని ఫెర్నాండో బాధతో మోకాళ్లపైనే కూర్చొని ఉన్నాడే తప్ప... బంతిని స్ట్రయికింగ్ ఎండ్ వైపుకు విసరేలపోయాడు. అదే సమయంలో ఫెర్నాండో అలసత్వాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న షమీ... వేగంగా స్ట్రయికింగ్ ఎండ్ వైపునకు చేరుకొని రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కీపర్ డిక్ వెల్లా బంతి కోసం విశ్వ ఫెర్నాండో కోసం ఎంత మొర పెట్టుకున్నా... అతడు మాత్రం కామెడీ చేసేశాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

జడేజా (228 బంతుల్లో 175 పరుగులు ; 17 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ సెంచరీకి తోడు పంత్‌ (97 బంతుల్లో 96; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) , రవిచంద్రన్ అశ్విన్ (82 బంతుల్లో 61 పరుగులు; 8 ఫోర్లు), హనుమ విహారీ (58; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలు తోడవ్వడంతో... టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ ను 8 వికెట్లకు 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India, India vs srilanka, Mohammed Shami, Ravindra Jadeja, Team India

ఉత్తమ కథలు