హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind vs SL : వారెవ్వా టీమిండియా.. సెంచరీ రికార్డుతో పాటు ఆ ఘనత కూడా భారత్ దే..

Ind vs SL : వారెవ్వా టీమిండియా.. సెంచరీ రికార్డుతో పాటు ఆ ఘనత కూడా భారత్ దే..

టీమిండియా (క్రెడిట్ బీసీసీఐ)

టీమిండియా (క్రెడిట్ బీసీసీఐ)

Ind vs SL: టీ20 ఫార్మాట్ లో టీమిండియా ఖాతాలో అదిరిపోయే రికార్డు చేరింది. టీమిండియా సెంచరీ రికార్డుతో దుమ్మురేపింది.

ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 (Ind vs SL)లో టీమిండియా (Team India) దుమ్మురేపింది. 184 పరుగుల టార్గెట్ ను మరో 17 బంతులు మిగిలుండగానే 17.1 ఓవర్లో ఛేజ్ చేసింది రోహిత్ సేన. టీమిండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ ( 44 బంతుల్లో77 పరుగులు నాటౌట్ ; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజూ శాంసన్ ( 25 బంతుల్లో 39 పరుగులు ; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా ( 18 బంతుల్లో45 పరుగులు నాటౌట్ ; 7 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించారు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగా 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార రెండు వికెట్లతో సత్తా చాటాడు. రోహిత్ శర్మ 1 పరుగు, ఇషాన్ కిషన్ 16 పరుగులు నిరాశపర్చారు. ఇక, ఈ విక్టరీతో టీమిండియా అదిరే రికార్డుల్ని తన ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా 100వ టి20 విజయాన్ని దక్కించుకుంది. అంటే టీమిండియాకు ఇది సెంచరీ విన్. ఇప్పటి వరకు టి20ల్లో 158 మ్యాచ్ లు ఆడిన భారత్... 100 మ్యాచ్ ల్లో గెలిచి... మరో 51 మ్యాచ్ ల్లో ఓడింది. మరో మూడు మ్యాచ్ లు టై అవ్వగా... నాలుగు మ్యాచ్ లు రద్దయ్యాయి. ఈ విక్టరీతో అంతర్జాతీయ టి20 మ్యాచ్ ల్లో శతక విజయం అందుకున్నా రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో పాకిస్తాన్ 117 విజయాలతో భారత్ కంటే ముందు తొలి స్ధానంలో ఉంది.

మరోవైపు, అంతర్జాతీయ టి20ల్లో స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు ప్రస్తుతానికైతే న్యూజిలాండ్ పేరిట ఉంది. ఆ జట్టు స్వదేశంలో 73 మ్యాచ్ లు ఆడి 39 మ్యాచ్ ల్లో గెలుపొంది హోం గ్రౌండ్స్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఉంది. అయితే, ఆ రికార్డు భారత్ ఇప్పుడు సమం చేసింది. భారత్ 60 మ్యాచ్ ల్లో 39 విజయాలతో న్యూజిలాండ్ తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది.

ఇది కూడా చదవండి : ఈ క్రికెటర్లు గ్రౌండ్ లోనే కాదు.. వెండితెరపై కూడా మెరిశారు.. యువరాజ్ అయితే..

మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ సొంతం చేసుకుంది భారత జట్టు. అయితే, రోహిత్ సేనకు వరుసగా 11వ విజయం. కంటిన్యూగా భారత్ కు ఇది 11 వ విక్టరీ అన్న మాట. భారత్ కన్నా అఫ్గానిస్థాన్ ముందుంది. అఫ్గాన్ జట్టు వరుసగా 12 మ్యాచుల్లో విజయం సాధించి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆదివారం జరిగే మూడో టీ20లో భారత్ విక్టరీ కొడితే.. ఈ రికార్డును భారత్ సమం చేస్తోంది.

First published:

Tags: Cricket, India vs srilanka, Jasprit Bumrah, Ravindra Jadeja, Rohit sharma, Sanju Samson, Shreyas Iyer, Team India, Virat kohli

ఉత్తమ కథలు