Home /News /sports /

INDIA VS SRI LANKA NO CROWED WILL BE ALLOWED FOR KOHLI 100TH TEST MATCH FOR INDIA IN MOHALI SJN

India vs sri lanka: ఆఖరికి కోహ్లీకి ఆ ఆనందాన్ని కూడా లేకుండా చేశారు

విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

India vs sri lanka: టీమిండియా (Team India) మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat kohli) ఫ్యాన్స్ ఆగ్రహాన్ని గురి చేసేలా మొహాలి క్రికెట్ సంఘం ఓ నిర్ణయం తీసుకుంది. మార్చి 4 నుంచి శ్రీలంక (Sri lanka)తో ఆరంభమయ్యే తొలి టెస్టు ద్వారా కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. అయితే ఆ ఘనతను అతడి ఫ్యాన్స్ ప్రత్యక్షంగా వీక్షించే పరిస్థితి లేకుండా పోయింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే చదవండి

ఇంకా చదవండి ...
India vs sri lanka:  చూస్తుంటే టీమిండియా (Team India) మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)కి రోజులు మంచిగా లేనట్లున్నాయి. గతేడాది టి20 ప్రపంచ కప్ (World cup) వరకు కూడా కింగ్ లా ఉన్న కోహ్లీ... ప్రస్తుతం కెప్టెన్సీని వదులుకొని... తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేక పోతున్నాడు.  టి20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి వన్డే, టెస్టుల్లో కెప్టెన్ గా కొనసాగుదామని కోహ్లీ భావిస్తే... వన్డే కెప్టెన్సీని కూడా లాక్కొని బీసీసీఐ (BCCI) ఊహించని షాక్ తో కోహ్లీ దిమ్మతిరిగేలా చేసింది. దీనిపై అప్పట్లో విరాట్ కోహ్లీ బహిరంగంగానే బీసీసీఐపై విమర్శలు చేశాడు. అనంతరం దీనికి బీసీసీఐ కూడా కౌంటర్ ఇవ్వడంతో కోహ్లీ, బీసీసీఐ మధ్య సఖ్యత లేదనే విషయం తేలింది.  ఇక దక్షిణాఫ్రికా (SouthAfrica) పర్యటనలో కూడా కోహ్లీ కెప్టెన్ గా విఫలమయ్యాడు. తొలి టెస్టులో విజయం సాధించినా... రెండో టెస్టుకు వెన్ను నొప్పితో అతడు దూరమయ్యాడు. ఆ మ్యాచ్ కు కేఎల్ రాహుల్ (KL Rahul) కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇక మూడో టెస్టులో మళ్లీ జట్టులోకి వచ్చిన కోహ్లీ టెస్టు పగ్గాలను చేపట్టాడు. అయితే అనూహ్యంగా ఆ మ్యాచ్ లో టీమిండియా ఓడటంతో సిరీస్ ను 1 2తో సౌతాఫ్రికాకు సమర్పించుకుంది. ఇదే సమయంలో కోహ్లీ తీసుకున్న నిర్ణయం సగటు క్రికెట్ అభిమానిని షాక్ కు గురిచేసింది. అదే టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పడం. దాంతో కేవలం మూడు నెలల వ్యవధిలో కెప్టెన్ కోహ్లీ కాస్తా మాజీ కెప్టెన్ కోహ్లీగా మారిపోయాడు.

కోహ్లీ కెప్టెన్ గా దిగిపోయి ఆటగాడిగా తన పని తాను చేసుకుంటుంటే... బీసీసీఐ మాత్రం కోహ్లీ అభిమానులను బాధ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది.  శ్రీలంకతో మార్చి 4 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు కోహ్లీకి ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. దానికి కారణం ఆ మ్యాచ్ ద్వారా కోహ్లీ టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడనున్నాడు. టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడటం ఏంటే ఎంతో ప్రత్యేకం.  దిగ్గజ ప్లేయర్లకు సైతం టెస్టుల్లో 100 మ్యాచ్ ఆడటం సాధ్యం అయ్యే పని కాదు. అయితే శ్రీలంకతో జరిగే ఈ టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనతను అందుకోనున్నాడు. తొలుత ఈ మ్యాచ్ బెంగళూరు (bangalore) వేదికగా జరగాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా కోహ్లీ ఐపీఎల్ (IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (royal challengers bangalore)కే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడి చిన్నస్వామి స్టేడియం ఒక రకంగా అతడికి హోం గ్రౌండ్ లా మారింది. అయితే బీసీసీఐ తొలి టెస్టును బెంగళూరు నుంచి మొహాలికి మారుస్తూ నిర్ణయం తీసుుకొని అందరికీ ముఖ్యంగా కోహ్లీ అభిమానులకు షాకిచ్చింది. శ్రీలంకతో జరిగే టెస్టు వేదికల జాబితా నుంచి బెంగళూరును పూర్తిగా తొలగించిందా అంటే... అదీ లేదు... రెండో టెస్టును బెంగళూరులోనే డే అండ్ నైట్ టెస్టుగా జరుపనుంది. వేదిక మార్చినా పర్లేదులే అనుకుంటే ఇప్పుడు మరో షాకింగ్ వార్తను వదిలింది. అయితే ఈసారి బీసీసీఐ నుంచి ఈ వార్త రాలేదు. మొహాలీ క్రికెట్ సంఘం నుంచి వచ్చింది. అదేంటంటే.. మార్చి 4 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టుకు స్టేడియంలోకి ప్రేక్షకుల అనుమతి లేదంటూ ప్రకటించింది. దాంతో కోహ్లీ శతక టెస్టును అతడి ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించే వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం ధర్మశాల వేదికగా జరుగుతోన్న టి20 సిరీస్ లో 2 వేల మందికి పైగా ప్రేక్షకులను మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనుమతిస్తున్నారు. అయితే కోహ్లీ ఆడే 100వ మ్యాచ్ కు మాత్రం ఎందుకు అనుమతించడం లేదంటూ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, India vs srilanka, KL Rahul, Royal Challengers Bangalore, South Africa, Team India, Virat kohli, World cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు