India vs Sri Lanka | బుమ్రా ధాటికి శ్రీలంక విల విల...4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో లంక...

India vs Sri Lanka Live Score, ICC World Cup 2019 Match at Leeds: భారత్ వర్సెస్ శ్రీలంక వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ ప్రారంభించగా, వరుస వికెట్ల పతనంతో లంక చిక్కుల్లో పడింది.

news18-telugu
Updated: July 6, 2019, 5:04 PM IST
India vs Sri Lanka | బుమ్రా ధాటికి శ్రీలంక విల విల...4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో లంక...
(Image : Twitter)
  • Share this:
India vs Sri Lanka Live Score, ICC World Cup 2019 Match at Leeds: లీడ్స్ వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ ప్రారంభించగా, వరుస వికెట్ల పతనంతో లంక చిక్కుల్లో పడింది. పేస్ బౌలర్ బుమ్రా ధాటికి ఓపెనర్లు కరుణ రత్నే(10), కుశాల్ పెరిరా(18) పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఫెర్నాండో(20), కుశాల్ మెండిస్ (3) తక్కువ పరుగలకే ఔట్ కావడంతో శ్రీలంక 100 పరుగుల లోపే 4 వికెట్లు కోల్పోయింది. శ్రీలంక కోల్పోయిన నాలుగు వికెట్లలో ధోనీ పట్టిన మూడు క్యాచులు, ఒక స్టంపౌట్ ఉండటం విశేషం. మరోవైపు ఈ మ్యాచ్ లో 2 వికెట్లు తీయడం ద్వారా బుమ్రా వంద వికెట్లు పడగొట్టిన 21వ భారతీయ క్రికెటర్‌గా పేరు పొందటం విశేషం. 7వ ఓవర్లో కుశాల్ పెరీరా వికెట్ పడగొట్టడం ద్వారా బుమ్రా వందవికెట్ల మైలురాయి అందుకుంది.





First published: July 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...