INDIA VS SRI LANKA LIVE SCORE 3RD T20I MATCH AT PUNE LANKA TO BOWL SAMSON GETS A GAME MK
India vs Sri Lanka: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లంక...సిరీస్ కోసం కోహ్లీ సేన తహ తహ
కోహ్లీ, మలింగ (File)
రెండో టీ-20లో భారత్ విజయం సాధించగా. మూడో టీ-20లో గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. మరోవైపు మూడో మ్యాచులో సత్తా చాటి శ్రీలంక సిరీస్‌ను సమానం చేయాలనుకుంటోంది.
పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగే చివరి టీ-20 మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో టీ-20లో భారత్ విజయం సాధించగా. మూడో టీ-20లో గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. మరోవైపు మూడో మ్యాచులో సత్తా చాటి శ్రీలంక సిరీస్‌ను సమానం చేయాలనుకుంటోంది. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో మూడు కీలక మార్పులు చేసింది. శివమ్ దూబే, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌ల స్థానంలో మనీశ్ పాండే, సంజూ శాంసన్, యుజవేంద్ర చాహల్‌లు జట్టులోకి వచ్చారు. ఇక శ్రీలంక తమ జట్టులో రెండు మార్పులు చేసింది. మ్యాథ్యూస్, లక్షన్ సందకన్‌లకు జట్టులో చోటు కల్పించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.