INDIA VS SRI LANKA LIVE SCORE 3RD T20I MATCH AT PUNE KOHLI AND WASHINGTON FALL IN QUICK SUCCESSION MK
India vs Sri Lanka: శ్రీలంక టార్గెట్ 202 పరుగులు...ప్రపంచ రికార్డు నెలకొల్పిన కోహ్లీ
కోహ్లీ
చివరి రెండు ఓవర్లలో శార్ధూల్ ఠాకూర్, మనీశ్ పాండేతో ఏకంగా 34 పరుగుల స్కోర్ జోడించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లంక బౌలింగ్‌లో సందకన్ 3, కుమారా, హసరంగా తలో వికెట్ తీశారు.
పుణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగే చివరి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 201/6 పరుగులు సాధించింది. ఆరంభంలో కేఎల్ రాహుల్(54), శిఖర్ ధావన్(52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టినప్పటికీ ఆ తర్వాత మాత్రం వరుసగా వికెట్లు పడ్డాయి. శిఖర్ ధవన్ ఔట్ కావడంతో బ్యాటింగ్‌కి వచ్చిన సంజూ తాను ఎదురుకున్న తొలి బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత హసరంగా వేసిన 12వ ఓవర్ మూడో బంతికి ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో అర్థశతకం సాధించి లోకేశ్ రాహుల్(54) అదే ఓవర్ మూడో బంతికి స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఒక ఫోర్ కొట్టి ఆ తర్వాతి బంతికి బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వరుస వికెట్లు పడుతున్న సమయంలో మనీశ్ పాండే, విరాట్ కోహ్లీలు జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కి వీరిద్దరు కలిసి 44 పరుగులు జోడించారు. ఈ దశలో కోహ్లీ(26) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే వాషింగ్టన్ సుందర్ డకౌట్ అయ్యాడు. చివరి రెండు ఓవర్లలో శార్ధూల్ ఠాకూర్, మనీశ్ పాండేతో ఏకంగా 34 పరుగుల స్కోర్ జోడించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లంక బౌలింగ్‌లో సందకన్ 3, కుమారా, హసరంగా తలో వికెట్ తీశారు.
కోహ్లీ వరల్డ్ రికార్డు...
పుణే వేదికగా శ్రీలంకతో జరిగే మూడో టీ-20లో కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అంతర్జాతీయ మ్యాచుల్లో అన్ని ఫార్మాట్లతో కలిపి 11 వేల పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. మహేంద్రసింగ్ ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత కెప్టెన్‌గా, మొత్తంగా ఆరో కెప్టెన్‌గా అతను రికార్డుల్లో కోహ్లీ స్థానం దక్కించుకున్నాడు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.