Home /News /sports /

INDIA VS SRI LANKA LIVE SCORE 3RD T20I MATCH AT PUNE INDIA WIN BY 78 RUNS TAKE SERIES MK

India vs Sri Lanka: పూణే టీ20లో శ్రీలంక చిత్తు...సిరీస్ భారత్ కైవసం

(Image: BCCI)

(Image: BCCI)

చివరి టీ-20లో శ్రీలంకపై భారత్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్ణయించిన 202 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో శ్రీలంక 123 పరుగులకు ఆలౌటైంది.

    భారత్, శ్రీలంక మధ్య జరిగిన చివరి టీ-20లో శ్రీలంకపై భారత్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్ణయించిన 202 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో శ్రీలంక 123 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్ల ధాటికి తొలి 5 ఓవర్లకే నాలుగు వికెట్లు కోల్పోయి శ్రీలంక కష్టాల్లోపడింది. భారత బౌలర్లలో బుమ్రా వేసిన మొదటి ఓవర్‌లో గుణతిలక(1), శార్దూల్ వేసిన రెండో ఓవర్‌లో అవిష్క పెర్నాండో(9) ఔట్ కాగా, బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో ఒషాడా ఫెర్నాండో(2)ను మనీశ్ పాండే రనౌట్ చేశాడు. ఇక నవ్‌దీప్ సైనీ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి కుషల్ పెరీరా(7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. ఆ తర్వాత ఏంజెలో మాథ్యూస్(31), ధనంజయ డిసిల్వా(57) పరుగులు సాధించినప్పటికీ ఆ తర్వాత వరుస వికెట్ల పతనంతో లంక 123 పరుగులకే ఆలౌటైంది.

    చివరి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 201/6 పరుగులు సాధించింది. ఆరంభంలో కేఎల్ రాహుల్(54), శిఖర్ ధావన్(52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టినప్పటికీ ఆ తర్వాత మాత్రం వరుసగా వికెట్లు పడ్డాయి. శిఖర్ ధవన్ ఔట్ కావడంతో బ్యాటింగ్‌కి వచ్చిన సంజూ తాను ఎదురుకున్న తొలి బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత హసరంగా వేసిన 12వ ఓవర్ మూడో బంతికి ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో అర్థశతకం సాధించి లోకేశ్ రాహుల్(54) అదే ఓవర్ మూడో బంతికి స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఒక ఫోర్‌ కొట్టి ఆ తర్వాతి బంతికి బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వరుస వికెట్లు పడుతున్న సమయంలో మనీశ్ పాండే, విరాట్ కోహ్లీలు జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కి వీరిద్దరు కలిసి 44 పరుగులు జోడించారు. ఈ దశలో కోహ్లీ(26) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే వాషింగ్టన్ సుందర్ డకౌట్ అయ్యాడు. చివరి రెండు ఓవర్లలో శార్ధూల్ ఠాకూర్, మనీశ్ పాండేతో ఏకంగా 34 పరుగుల స్కోర్ జోడించారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లంక బౌలింగ్‌లో సందకన్ 3, కుమారా, హసరంగా తలో వికెట్ తీశారు.

    కోహ్లీ వరల్డ్ రికార్డు...
    పుణే వేదికగా శ్రీలంకతో జరిగే మూడో టీ-20లో కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అంతర్జాతీయ మ్యాచుల్లో అన్ని ఫార్మాట్లతో కలిపి 11 వేల పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. మహేంద్రసింగ్ ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత కెప్టెన్‌గా, మొత్తంగా ఆరో కెప్టెన్‌గా అతను రికార్డుల్లో కోహ్లీ స్థానం దక్కించుకున్నాడు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Cricket, India vs srilanka

    తదుపరి వార్తలు