INDIA VS SRI LANKA LIVE SCORE 2ND T20I MATCH AT INDORE WASHINGTON DISMISSES FERNANDO MK
India vs Sri Lanka: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీసేన...రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
(Image: BCCI)
రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపింది. 4.5 ఓవర్ల వద్ద శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి వికెట్ కోల్పోగా, 54 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ఇండోర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపింది. 4.5 ఓవర్ల వద్ద శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి వికెట్ కోల్పోగా, 54 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. సిరీస్‌పై పట్టు కోసం ఇరు జట్లు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి. టీ20 వరల్డ్‌కప్ కోసం కసరత్తు చేస్తున్న టీమిండియాకు రెండు, మూడు స్థానాల్లో బ్యాటింగ్ చేసేందుకు చక్కటి ఆటగాళ్లను ఎంచుకోవాలని కోహ్లీ ప్లాన్స్ వేస్తున్నాడు. శ్రీలంక కూడా ఈ మ్యాచ్ విజయంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే ధావన్‌పై అధిక ఒత్తిడి నెలకొంది. గాయాలతో గతేడాది పలు సిరీస్‌లకు దూరమైన ధావన్.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో చెలరేగితేనే వరల్డ్‌కప్ బెర్త్ దక్కుతుంది. శ్రీలంక పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. టీమ్ మొత్తం ఒత్తిడికి లోనవుతోంది. కెప్టెన్‌గా మలింగకు ఈ సిరీస్ కఠిన పరీక్ష అనే చెప్పవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.