Home /News /sports /

INDIA VS SRI LANKA LIVE SCORE 2ND T20I MATCH AT INDORE RAHUL DEPARTS FOR 45 MK

India vs Sri Lanka: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...విజయం వైపు అడుగులు...

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...విజయం వైపు అడుగులు...

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా...విజయం వైపు అడుగులు...

శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా బ్యాట్స్‌మన్ నిలకడగా అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 11 ఓవర్లకు గానూ 85 పరుగులు చేసింది.

    ఇండోర్ వేదికగా జరుగుతన్న రెండో టీ20 మ్యాచులో శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా బ్యాట్స్‌మన్ నిలకడగా అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.  బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 11 ఓవర్లకు గానూ 85 పరుగులు చేసింది. ఓపెనర్లు లోకేశ్ రాహుల్, శిఖర్ ధవన్‌లు జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. 9.1 ఓవర్ల వద్ద కేఎల్ రాహుల్(45) ఔట్ అయ్యాడు. ఇదిలా ఉంటే శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన అవిష్క ఫెర్నాండోను వాషింగ్టన్ సుందర్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత 54 పరుగుల వద్ద మరో ఓపెనర్ గుణతిలక(20)ను నవదీప్ సైనీ బౌల్డ్ చేశాడు. దీంతో లంక కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే, వికెట్ కీపర్ కుశాల్ పెరీరా 34 పరుగులు చేసి జట్టును గాడిలో పెట్టాడు. ఈ క్రమంలో ఒషాడా ఫెర్నాండో (10) అవుట్ కావడంతో శ్రీలంక వికెట్ల పతనం వేగం పుంజుకుంది. భారత బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక బ్యాట్స్‌మన్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో లంక ఇన్నింగ్స్ 142 పరుగుల వద్ద ముగిసింది. లంక బ్యాట్స్‌మెన్‌లలో కుశాల్ పెరీరా చేసిన 34 పరుగులు చేశాడు.

    భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్‌లో చెరో వికెట్ పడగొట్టారు. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా‌ రద్దు కావడంతో.. సిరీస్‌‌పై పట్టు కోసం ఇరు జట్లు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Cricket, India vs srilanka, Sports

    తదుపరి వార్తలు