ఇండోర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో టీమిండియా విజయం సాధించింది. శ్రీలంకను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. శ్రీలంక నిర్ణయించిన 143 పరుగుల లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలి ఉండగానే అందుకొని కోహ్లీ సేన సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. శ్రీలంక విసిరిన 143 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్(45), శిఖర్ ధావన్ (32) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అనంతరం వీరిద్దరూ ఔట్ అవ్వగా, ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్(34), కెప్టెన్ విరాట్ కోహ్లీ (30) కలిసి మ్యాచ్‌ను విజయం వైపు నడిపించారు. చివర్లో విజయానికి మరో 6 పరుగుల దూరంలో శ్రేయస్ అయ్యర్ ఔటవగా, అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన రిశబ్ పంత్(1) తో కలిసి కోహ్లీ మ్యాచును దిగ్విజయం ముగించాడు.
ఇదిలా ఉంటే శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన అవిష్క ఫెర్నాండోను వాషింగ్టన్ సుందర్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత 54 పరుగుల వద్ద మరో ఓపెనర్ గుణతిలక(20)ను నవదీప్ సైనీ బౌల్డ్ చేశాడు. దీంతో లంక కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే, వికెట్ కీపర్ కుశాల్ పెరీరా 34 పరుగులు చేసి జట్టును గాడిలో పెట్టాడు. ఈ క్రమంలో ఒషాడా ఫెర్నాండో (10) అవుట్ కావడంతో శ్రీలంక వికెట్ల పతనం వేగం పుంజుకుంది. భారత బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక బ్యాట్స్‌మన్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో లంక ఇన్నింగ్స్ 142 పరుగుల వద్ద ముగిసింది. లంక బ్యాట్స్‌మెన్‌లలో కుశాల్ పెరీరా చేసిన 34 పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా, నవ్‌దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్‌లో చెరో వికెట్ పడగొట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.