ఎట్టకేలకు వరణుడు కరుణించాడు. కాసేపట్లో గువహాటీలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బర్సపరా స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంకపై విజయంతో 2020 కొత్త సంవత్సరం ఆరంభించాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. చేజింగ్‌కు ఈ పిచ్ అనుకూలం కావడంతోనే ఫీల్డింగ్ ఎంచుకున్నట్టు కోహ్లీ తెలిపాడు. పాండే, శాంసన్, చాహల్, జడేజాలు ఈ మ్యాచుకు దూరంగా ఉన్నారు. కుల్దీప్ యాదవ్, వాష్టింగ్టన్ సుందర్ జట్టులో ఆడుతున్నారు. దీంతో మొత్తం ముగ్గురు సీమర్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. శ్రీలంక సైతం ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగడం విశేషం.
Update - It has stopped raining and we will have an inspection at 8.15 PM IST. Stay tuned #INDvSL
— BCCI (@BCCI) January 5, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.