INDIA VS SRI LANKA KARNATAKA CRICKET ASSOCIATION ALLOWS 100 PERCENT FANS TO WATCH INDIA VS SRI LANKA DAY AND NIGHT AT BENGALURU SJN
India vs Sri lanka: పింక్ బాల్ టెస్టు ముంగిట టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...
టీమిండియా (PC: BCCI)
India vs Sri lanka: టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. శనివారం నుంచి శ్రీలంకతో ఆరంభమయ్యే డే అండ్ నైట్ టెస్టు కోసం ప్రేక్షకులను అనుమతించే విషయంపై కీలక ప్రకటన చేసింది. దాని గురించి తెలుసుకునేందుకు పూర్తి వార్తను చదవండి
India vs Sri lanka: బెంగళూరు (bengaluru) వేదికగా రేపటి నుంచి ఆరంభమయ్యే భారత్ (India), శ్రీలంక (Sri lanka) డే అండ్ నైట్ టెస్టు ముంగిట టీమిండియా ఫ్యాన్స్ కు కర్ణాటక క్రికెట్ సంఘం (Karnataka cricket Association) గుడ్ న్యూస్ తెలిపింది. శనివారం నుంచి ఆరంభమయ్యే పింక్ బాల్ టెస్టుకు 100 శాతం మంది ఫ్యాన్స్ ను అనుమతిస్తూ కర్ణాటక క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొహాలి వేదికగా జరిగిన తొలి టెస్టును ప్రత్యక్షంగా వీక్షించడానికి 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన విషం తెలిసందే. తాజాగా దీన్ని 100 శాతానికి పెంచారు.
గతంలో దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించడాన్ని నిషేధించారు. అనంతరం కరోనా తీవ్రత తగ్గుతూ వస్తుండటంతో మొదట 25 శాతం ప్రేక్షకులను... ఆ తర్వాత దానిని 50 శాతంగా పెంచారు. కరోనా తర్వాత దేశంలో జరుగుతున్న ఓ క్రికెట్ మ్యాచ్ కు 100 శాతం మందిని అనుమతించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
తొలి టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా రెండో టెస్టు తుది జట్టుపై కసరత్తు చేస్తోంది. తొలి టెస్టులో చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే స్థానాల్సి భర్తీ చేసిన హనుమ విహారీ, శ్రేయస్ అయ్యర్ స్థానాలను కొనసాగించే అవకాశం ఉంది. ఇక ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా, ప్రధాన స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ స్థానాలు ఖాయం. అయితే ఇది పింక్ బాల్ తో జరిగే మ్యాచ్ కాబట్టి... పేస్ కు అనుకూలంగా ఉండొచ్చు. దాంతో తొలి టెస్టులో లాగా ముగ్గరు స్పిన్నర్లతో కాకుండా ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అలా జరిగితే మూడో స్పిన్నర్ జయంత్ యాదవ్ బదులు హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ కు తుది జట్టులో చోటు దొరకవచ్చు. లేదు ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలనుకుంటే మాత్రం జయంత్ యాదవ్ ప్లేస్ లో అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకోనే ఛాన్సుంది. ఇటీవలే.. గాయం నుంచి కోలుకున్న అక్షర్ పటేల్ ని టీమిండియా స్క్వాడ్ లో చేర్చారు బీసీసీఐ సెలెక్టర్లు. పింక్ బాల్ తో అక్షర్ పటేల్ చాలా డేంజరస్ బౌలర్. మరోవైపు.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ బౌలింగ్ బాధ్యతల్ని మోయనున్నారు. బుమ్రా, షమీ కొత్త బంతిని పంచుకున్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.