హోమ్ /వార్తలు /క్రీడలు /

Virat Kohli : టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. కానీ, కోహ్లీ ఫ్యాన్స్ కు మాత్రం మండిపోతుంది..!

Virat Kohli : టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. కానీ, కోహ్లీ ఫ్యాన్స్ కు మాత్రం మండిపోతుంది..!

Virat Kohli : బీసీసీఐ వర్సెస్ కోహ్లీ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. కోహ్లీ కెప్టెన్ గా దిగిపోయి ఆటగాడిగా తన పని తాను చేసుకుంటుంటే... బీసీసీఐ మాత్రం కోహ్లీ అభిమానులను బాధ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది.

Virat Kohli : బీసీసీఐ వర్సెస్ కోహ్లీ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. కోహ్లీ కెప్టెన్ గా దిగిపోయి ఆటగాడిగా తన పని తాను చేసుకుంటుంటే... బీసీసీఐ మాత్రం కోహ్లీ అభిమానులను బాధ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది.

Virat Kohli : బీసీసీఐ వర్సెస్ కోహ్లీ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. కోహ్లీ కెప్టెన్ గా దిగిపోయి ఆటగాడిగా తన పని తాను చేసుకుంటుంటే... బీసీసీఐ మాత్రం కోహ్లీ అభిమానులను బాధ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది.

  బీసీసీఐ వర్సెస్ కోహ్లీ (BCCI vs Virat Kohli) వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. కోహ్లీ (Virat Kohli) కెప్టెన్ గా దిగిపోయి ఆటగాడిగా తన పని తాను చేసుకుంటుంటే... బీసీసీఐ మాత్రం కోహ్లీ అభిమానులను బాధ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. శ్రీలంకతో మార్చి 4 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు కోహ్లీకి ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. దానికి కారణం ఆ మ్యాచ్ ద్వారా కోహ్లీ టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడనున్నాడు. టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడటం ఏంటే ఎంతో ప్రత్యేకం. దిగ్గజ ప్లేయర్లకు సైతం టెస్టుల్లో 100 మ్యాచ్ ఆడటం సాధ్యం అయ్యే పని కాదు. అయితే శ్రీలంకతో జరిగే ఈ టెస్టు ద్వారా కోహ్లీ ఈ ఘనతను అందుకోనున్నాడు. తొలుత ఈ మ్యాచ్ బెంగళూరు (Bangalore) వేదికగా జరగాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా కోహ్లీ ఐపీఎల్ (IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)కే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడి చిన్నస్వామి స్టేడియం ఒక రకంగా అతడికి హోం గ్రౌండ్ లా మారింది. అయితే బీసీసీఐ తొలి టెస్టును బెంగళూరు నుంచి మొహాలికి మారుస్తూ నిర్ణయం తీసుుకొని అందరికీ ముఖ్యంగా కోహ్లీ అభిమానులకు షాకిచ్చింది.

  శ్రీలంకతో జరిగే టెస్టు వేదికల జాబితా నుంచి బెంగళూరును పూర్తిగా తొలగించిందా అంటే... అదీ లేదు... రెండో టెస్టును బెంగళూరులోనే డే అండ్ నైట్ టెస్టుగా జరుపనుంది. వేదిక మార్చినా పర్లేదులే అనుకుంటే ఇప్పుడు మరో షాకింగ్ వార్తను వదిలింది. అయితే ఈసారి బీసీసీఐ నుంచి ఈ వార్త రాలేదు. మొహాలీ క్రికెట్ సంఘం నుంచి వచ్చింది. అదేంటంటే.. మార్చి 4 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టుకు స్టేడియంలోకి ప్రేక్షకుల అనుమతి లేదంటూ ప్రకటించింది. దాంతో కోహ్లీ శతక టెస్టును అతడి ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించే వీలు లేకుండా పోయింది.

  అయితే, విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్‌ను వీక్షించ‌డానికి మొహాలీ స్టేడియంలోకి ప్రేక్ష‌కుల‌ను అనుమతించ‌డం లేద‌ని నిరాశ‌లో ఉన్న అభిమానుల‌కు క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ ఊర‌ట‌నిచ్చే శుభ‌వార్త చెప్పింది. శ్రీ‌లంక‌తో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగ‌నున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమతించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ కార్యదర్శి సంతోష్ మీనన్ ధృవీకరించారు. ఈ మేర‌కు ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ సంతోష్ మీనన్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

  రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గిన నేప‌థ్యంలో భార‌త్, శ్రీ‌లంక టెస్టు మ్యాచ్‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమతించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోర‌గా అందుకు అంగీక‌రించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. స్టేడియంలోకి 50 % ప్రేక్ష‌కుల‌ను అనుమతించేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌భుత్వం అనుమతించ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన సంతోష్ మీన‌న్ క‌రోనా ప్రోటోకాల్ ప్ర‌కారం మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు.

  ఇది కూడా చదవండి : ఈ క్రికెటర్లు గ్రౌండ్ లోనే కాదు.. వెండితెరపై కూడా మెరిశారు.. యువరాజ్ అయితే..

  కాగా బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో టెస్టు డే అండ్ నైట్ మ్యాచ్‌గా జ‌ర‌గ‌నుంది. తొలి సారిగా బెంగ‌ళూరులోని చిన్నస్వామి స్టేడియం పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వ‌నుంది. ఈ మేర‌కు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, ఈ మ్యాచ్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఉన్న ఏ అవ‌కాశాన్ని వ‌దిలి పెట్ట‌మ‌ని క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ కార్యదర్శి సంతోష్ మీనన్ తెలిపారు.

  ఈ టెస్టు మ్యాచ్ మార్చి 12 నుంచి 16 మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌గా జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్ ప్ర‌తిరోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతుంది. ఇక మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల‌ను మార్చి 1 నుంచి క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు.

  మార్చి 6 నుంచి టికెట్లు స్టేడియం వద్ద ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. టికెట్ల ధ‌ర‌లు 100 రూపాయ‌ల నుంచి 2,500 రూపాయ‌ల మ‌ధ్య ఉన్నాయి. అయితే, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు ఇది మింగుడుపడటం లేదు. మొహాలీలో కోహ్లీ మైల్ స్టోన్ మ్యాచ్ కు బీసీసీఐయే కావాలని ప్రేక్షకుల్లేకుండా చేసిందని వారు ఆరోపిస్తున్నారు. బీసీసీఐ తలుచుకుంటే.. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఫ్యాన్స్ అనుమతించదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బీసీసీఐ కావాలనే.. విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తోందంటూ వారు మండిపడుతున్నారు.

  First published:

  Tags: Bcci, Cricket, India vs srilanka, Rohit sharma, Team India, Virat kohli

  ఉత్తమ కథలు