హోమ్ /వార్తలు /క్రీడలు /

India vs Sri lanka first test: జడేజా రికార్డు సెంచరీ... పాపం శ్రీలంక... ఇక వారికి కష్టమే

India vs Sri lanka first test: జడేజా రికార్డు సెంచరీ... పాపం శ్రీలంక... ఇక వారికి కష్టమే

టీమిండియా (PC: BCCI)

టీమిండియా (PC: BCCI)

India vs Sri lanka first test: శ్రీలంక (Sri lanka)తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా (Team Inida) పట్టు బిగించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భారీ శతకంతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించిన భారత్... అనంతరం శ్రీలంకను దెబ్బ తీశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు చదవండి

ఇంకా చదవండి ...

India vs Sri lanka first test: శ్రీలంక (Srilanka), భారత్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో ఎవరు గెలుస్తారన్న విషయంపై రెండో రోజే ఆటతో  ఓ క్లారిటీ వచ్చేసింది. ఓవర్ నైట్ స్కోరు 357/6తో రెండో రోజైన శనివారం ఆటను కొనసాగించిన టీమిండియా (Team India)... శ్రీలంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. చాలా రోజుల తర్వాత రవీంద్ర జడేజా (228 బంతుల్లో 175 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. అతడికి  రిషభ్ పంత్ (Rishabh Pant) (97 బంతుల్లో 96; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) , రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) (82 బంతుల్లో 61 పరుగులు; 8 ఫోర్లు), హనుమ విహారీ (Hanuma vihari) (58; 5 ఫోర్లు)ల హాఫ్ సెంచరీలు కూడా తోడవ్వడంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 8 వికెట్లకు 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.  శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దేనియా తలా రెండు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్ లో 43 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం పాతుం నిసంక (75 బంతుల్లో 26 బ్యాటింగ్; 4 ఫోర్లు), చరిత్ అసలంక (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.  సూపర్ ఫామ్ లో ఉన్న ఆ జట్టు సారథి దిముత్ కరుణ రత్నే (71 బంతుల్లో 28; 5 ఫోర్లు)ను సెంచరీ హీరో జడేజా ఎల్బీగా పెవిలియన్ కు చేర్చాడు. మరో ఓపెనర్ లహిరు తిరుమన్నే (60 బంతుల్లో 17; ఫోర్)ను రవిచంద్రన్ అశ్విన్ ఎల్బీగా అవుట్ చేశాడు.  నిలకడగా ఆడినట్లు కనిపించిన మ్యాథ్యూస్ (22; ఫోర్, సిక్స్) బుమ్రా బౌలింగ్ లో పెవిలియన్ కు చేరగా... ధనంజయ డిసిల్వా (1)ని అశ్విన్ అవుట్ చేశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ లో అవుటైన నలుగురు కూడా ఎల్బీ కావడం విశేషం. శ్రీలంక ప్రస్తుతం 466 పరుగులు వెనుకబడి ఉంది.

సూపర్ జడేజా

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 45 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన జడేజా... లంక బౌలర్లను ఉతికారేశాడు. 228 బంతులతో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 17 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. జడేజా కెరీర్ లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. తాజా ప్రదర్శనతో జడేజా 35 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన రవీంద్ర జడేజా... 175 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా టీమిండియా తరఫున ఆ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్ (Kapil dev) పేరిట ఉండేది. అతడు 1986లో శ్రీలంకతోనే జరిగిన టెస్టు మ్యాచ్ లో ఏడో స్థానంలో బరిలోకి దిగి 163 పరుగులు చేశాడు. తాజాగా ఆ రికార్డును జడేజా బ్రేక్ చేశాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Hanuma vihari, India, India vs srilanka, Ravichandran Ashwin, Ravindra Jadeja, Rishabh Pant, Sri Lanka, Team India

ఉత్తమ కథలు