Home /News /sports /

INDIA VS SRI LANKA FIRST TEST TEAM INDIA CAPTAIN ROHIT SHARMA AND COACH RAHUL DRAVID GETS ANGRY AFTER JASPRIT BUMRAH NO BALL SJN

India vs Sri lanka First test: వికెట్ తీసిన ఆనందంలో బుమ్రా.. అంతలో రోహిత్, ద్రవిడ్ అసహనం.. కారణం ఏంటంటే?

India vs Sri lanka First test: శ్రీలంక (Sri lanka)తో జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో భారత వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (jasprit bumrah)) చేసిన ఓ తప్పిదం అటు సారథి రోహిత్ శర్మను, ఇటు కోచ్ రాహుల్ ద్రవిడ్ ను అసహనానికి గురి చేసేలా చేశాయ్.. అదేంటో తెలుసుకోవాలంటే చదవండి

ఇంకా చదవండి ...
India vs Sri lanka First test: శ్రీలంక (Sri lanka), భారత్ (India) మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. తొలుత టీమిండియా బ్యాటింగ్ చేస్తుంటే ఓ ఈజీ రనౌట్ ను శ్రీలంక బౌలర్ విశ్వ ఫెర్నాండో మిస్ చేశాడు. ఆ తర్వాత శ్రీలంక బ్యాటింగ్  చేస్తోన్న సమయంలో భారత వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (jasprit bumrah) చేసిన ఓ పని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)లను అసహనానికి గురి చేసింది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో... ఇన్నింగ్స్ 32వ ఓవర్ ను బుమ్రా వేయడానికి వచ్చాడు. అదే సమయంలో స్ట్రయికింగ్ ఎండ్ లో నిసాంక 14 పరుగులతో ఉన్నాడు. అద్భుతమైన ఇన్ స్వింగర్ తో నిసాంకను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు.

అంతే టీమిండియా సంబరాల్లో మునిగి తేలగా... బుమ్రా అద్భుత డెలివరీ గురించి కామెంటేటర్లు పొగడ్తల వర్షం కురిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే అదే సమయంలో అంపైర్ నితిన్ మీనన్ ఆ బంతిని నో బాల్ గా ప్రకటించాడు. అంతే భారత శిబిరంలో సంబరాలు ఆవిరవ్వగా... హమ్మయ్యా బతికిపోయా అంటూ నిసాంక మళ్లీ క్రీజులోకి చేరుకున్నాడు. ఇక అక్కడే ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, డగౌట్ లో ఉన్న కోచ్ రాహుల్ ద్రవిడ్ ’ఏంటి బుమ్రా ఇది?‘ అన్నట్లు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు.

నో బాల్స్ వేయడం బుమ్రాకు ఇదేమి కొత్త కాదు. ఎంత మంచి బంతులు వేస్తున్నా... అప్పుడప్పుడు నో బాల్స్ వేస్తూ మూల్యం చెల్లించుకుంటున్నాడు.  బుమ్రా వికెట్ తీసిన తర్వాత నోబాల్ అని తేలడం ఇదేమి మొదటి సారి కాదు. ఇంతకుముందు కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2018లో ఆస్ట్రేలియాకు చెందిన షాన్ మార్ష్, 2021లో ఇంగ్లండ్ కు చెందిన ఒలీ రాబిన్సన్ లను బుమ్రా అవుట్ చేయగా... అనంతరం అవి నో బాల్స్ గా తేలాయి.

అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను  8 వికెట్లకు 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా (228 బంతుల్లో 175 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగాడు. అతడికి  రిషభ్ పంత్ (Rishabh Pant) (97 బంతుల్లో 96; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) , రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) (82 బంతుల్లో 61 పరుగులు; 8 ఫోర్లు), హనుమ విహారీ (Hanuma vihari) (58; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో సహకరించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం పాతుం నిసంక (75 బంతుల్లో 26 బ్యాటింగ్; 4 ఫోర్లు), చరిత్ అసలంక (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India, India vs srilanka, Jasprit Bumrah, Rahul dravid, Rohit sharma, Sri Lanka, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు