హోమ్ /వార్తలు /sports /

IND vs SL : నేడు శ్రీలంకతో చివరి టీ20... సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

IND vs SL : నేడు శ్రీలంకతో చివరి టీ20... సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

Ind vs SL 3rd T20 : ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా... సిరీస్ గెలిచి... సత్తా చాటాలని చూస్తోంది. రాత్రి 7 గంటల నుంచీ ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో రానుంది.

    India vs Sri Lanka 3rd T20 : టీమిండియా కూల్‌గా టెన్షన్లు లేకుండా ఆడేందుకు వీలైన మ్యాచ్ ఇవాళ జరగబోతోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షార్పణం కావడంతో... రెండో మ్యాచ్ నెగ్గిన కోహ్లీసేన... సిరీస్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. అందువల్ల ఇవాళ్టి మ్యాచ్ నెగ్గే అంశంలో టీమిండియాపై మరీ ఎక్కువ ఒత్తిడి లేదు. గెలిస్తే... సిరీస్ సొంతమవుతుంది. ఓడితే... సిరీస్ సమం అవుతుంది. అయినప్పటికీ... గెలిచి సత్తా చాటేందుకు కోహ్లీ అండ్ కో సిద్ధంగా ఉంది. ఐతే... సిరీస్ కోల్పోయే అవకాశం లేకపోవడంతో... కొన్ని ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. ఇవాళ మ్యాచ్ జరిగే పుణె స్టేడియంలో టీమిండియా ఇదివరకు... రెండు టీ20లు ఆడి... ఒకటి గెలిచి, ఒకటి ఓడింది. శ్రీలంక దురదృష్టమేంటంటే... ఆ జట్టులో ఓ తరం ఆటగాళ్లు నైన్టీస్‌లో అదరగొట్టారు. వాళ్ల వారసులుగా వచ్చిన జట్టు సభ్యులు మాత్రం... దశాబ్ద కాలంగా భారత్ చేతిలో సిరీస్ కోల్పోతూనే ఉన్నారు. తాజా సిరీస్‌లోనూ లంక టీమ్ అంతంత మాత్రంగానే ఉంది. అందువల్లే నేటి మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. మనీశ్ పాండే, సంజూ శాంసన్ లకు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. ఈ సీజన్‌లో ఓపెనింగ్‌లో ఆకట్టుకోలేకపోతున్న శిఖర్ ధవన్‌పై మాత్రం ఒత్తిడి ఉంది.

    ఇవాళ్టి మ్యాచ్‌ కెప్టెన్ విరాట్ కోహ్లీకి స్పెషల్ కానుంది. అతడు మరో రన్ సాధిస్తే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి వేగంగా 11,000 రన్స్ చేసిన కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ నిలుస్తాడు. ఇప్పటివరకూ ఆరుగురు కెప్టెన్లు ఈ రికార్డ్ సాధించారు.

    భారత జట్టు అంచనా : విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, రిషభ్‌ పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబే, కుల్దీ్‌ప్ చాహల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా, సైనీ.

    శ్రీలంక జట్టు అంచనా : మలింగ (కెప్టెన్‌), గుణతిలక, కుశాల్‌ పెరీర, అవిష్క ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్‌, రాజపక్స, షనక, ధనంజయ డిసిల్వ, హసరంగ, లాహిరు కుమార, ఒషాడో ఫెర్నాండో.

    First published:

    ఉత్తమ కథలు