హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs SL: కోహ్లీ ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ... అందుకు సిద్ధమంటూ ప్రకటన

IND vs SL: కోహ్లీ ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ... అందుకు సిద్ధమంటూ ప్రకటన

IND vs SL: విరాట్ కోహ్లీ (Virat Kohli) అభిమానులు సంతోషపడేలా బీసీసీఐ (BCCI) గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంత కాలంగా విరాట్ కోహ్లీకి, బీసీసీఐకి మధ్య సఖ్యత లేదని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో కోహ్లీ 100వ టెస్టు విషయంలో బీసీసీఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనవసర చర్చకు దారి తీశాయి. అయితే తాజాగా బీసీసీఐ చేసిన ఓ ప్రకటన వీటికి ఫుల్ స్టాప్ పెట్టేలా కనిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

IND vs SL: టీమిండియా (Team India) మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మార్చి 4వ తేదీ నుంచి మొహాలీ వేదికగా శ్రీలంక (Sri lanka)తో ఆరంభమయ్యే తొలి టెస్టుకు అభిమానులను స్టేడియంలోకి అనుమతిస్తూ బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకుంది. 50 శాతం ప్రేక్షకులతో మ్యాచ్ ను జరపొచ్చని తన ప్రకటనలో పేర్కొంది. టికెట్లను అన్ లైన్ (Online) లో విక్రయించనున్నట్లు పేర్కొంది. బీసీసీఐ ప్రకటనతో కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మొహాలీ టెస్టు విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైంది. ఆ టెస్టు ద్వారా అతికొద్ది మంది క్రికెటర్లు సాధించే రికార్డును కోహ్లీ సాధించనున్నాడు. అదే టెస్టుల్లో 100వ మ్యాచ్ ఆడటం. వన్డే, టి20ల్లో వందలకొద్ది మ్యాచ్ లు ఆడినా... టెస్టుల్లో 100వ మ్యాచ్ అడటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ()సైతం టెస్టుల్లో 100 మార్కును చేరుకోలేదు. ఇప్పటి వరకు భారత్ నుంచి టెస్టుల్లో 100 మ్యాచ్ లు ఆడిన ప్లేయర్స్ కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. తాజాగా మొహాలీ టెస్టు ద్వారా ఆ జాబితాలో కోహ్లీ కూడా చేరనున్నాడు.

శ్రీలంక ()తో జరిగే టెస్టు సిరీస్ సందర్భంగా బీసీసఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అతడి అభిమానులను ఆగ్రహించేలా చేశాయి. షెడ్యూల్ ప్రకారం తొలి టెస్టు  బెంగళూరు (bangalore) వేదికగా జరగాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా కోహ్లీ ఐపీఎల్ (IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (royal challengers bangalore)కే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడి చిన్నస్వామి స్టేడియం ఒక రకంగా అతడికి హోం గ్రౌండ్ లా మారింది. అయితే బీసీసీఐ తొలి టెస్టును బెంగళూరు నుంచి మొహాలికి మారుస్తూ నిర్ణయం తీసుుకొని అందరికీ ముఖ్యంగా కోహ్లీ అభిమానులకు షాకిచ్చింది. శ్రీలంకతో జరిగే టెస్టు వేదికల జాబితా నుంచి బెంగళూరును పూర్తిగా తొలగించిందా అంటే... అదీ లేదు... రెండో టెస్టును బెంగళూరులోనే డే అండ్ నైట్ టెస్టుగా జరుపనుంది. వేదిక మార్చినా పర్లేదులే అనుకుంటే... మార్చి 4 నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టుకు స్టేడియంలోకి ప్రేక్షకుల అనుమతి లేదంటూ తొలుత ప్రకటించింది. దాంతో ఆగ్రహించిన కోహ్లీ అభిమానులు ట్విట్టర్ వేదికగా బీసీసీఐ తీరును విమర్శిస్తూ వస్తున్నారు.

గతేడాది కెప్టెన్సీ రాజీనామా విషయంలో విరాట్ కోహ్లీకి, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)కి మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. బీసీసీఐ, కోహ్లీ మధ్య పొసగడం లేదంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా కోహ్లీ  100వ టెస్టు విషయంలో  బీసీసీఐ అనుసరించిన విధానంపై కూడా చర్చకు దారి తీసింది. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ వెనక్కి తగ్గింది. కోహ్లీ 100వ టెస్టుకు అభిమానులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడంతో కోహ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం.

First published:

Tags: Bcci, India vs srilanka, Sourav Ganguly, Sri Lanka, Team India, Virat kohli

ఉత్తమ కథలు