శ్రీలంక పర్యటన కోసం టీం ఇండియాను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) ప్రకటించింది. భారత్ తరుపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న మరో జట్టు ఇది. మొదటి జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ప్రముఖ ఓపెనర్ శిఖర్ ధావన్ శ్రీలంక పర్యటించే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు.
ఐపీఎల్, దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లకు జట్టులో అవకాశం లభించింది. దేవదత్ పాడికల్, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియా, రితురాజ్ గైక్వాడ్, నితీష్ రానా మొదటిసారి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. సెలెక్టర్లు గురువారం (జూన్ 10) రాత్రి జట్టును ప్రకటించారు. ఈ 20 మంది జట్టులో ఇషాన్ కిషన్, సంజు సామ్సన్ వికెట్ కీపర్లుగా ఎంపీకవగా... ఐదుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైస్‌గా ఉంచారు. వారిలో ఇషాన్ పోరెల్, సందీప్ వారియర్, అర్ష్‌దీప్ సింగ్, సాయి కిషోర్, సిమ్రాంజిత్ సింగ్ ఉన్నారు.
ఇంగ్లండ్‌తో వన్డే, టీ 20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో చోటు దక్కించుకున్న రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్ళు ఈ జట్టులో కూడా తమ స్థానాన్ని నిలుపుకున్నారు. ఈ టి 20 సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి, నవదీప్ సైని, దీపక్ చాహర్ కూడా జట్టులో భాగమే కాని వారు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేదు.
కొన్నేళ్లుగా ఐపీఎల్లో నిలకడగా రాణించిన నితీష్ రానాపై సెలెక్టర్లు విశ్వాసం వ్యక్తం చేశారు. మనీష్ పాండే కూడా తిరిగి జట్టుల చేరాడు. చేతన్ సకారియా ఐపిఎల్ 2021 మొదటి సీజన్లో తన స్టార్ ప్రదర్శన ఆధారంగా జట్టులో చోటుదక్కింది. అనుభవజ్ఞుడైన కర్ణాటక స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ కూడా ఎంపికయ్యాడు.
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇది బ్యాట్స్ మెన్: శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పాడికల్, రితురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రానా.
వికెట్ కీపర్లు: ఇషాన్ కిషన్, సంజు సామ్సన్. ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా.
స్పిన్నర్లు: యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, కృష్ణప్ప గౌతమ్.
ఫాస్ట్ బౌలర్లు: భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), దీపక్ చాహర్, నవదీప్ సైని, చేతన్ సకారియా.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.