India vs South Africa: సఫారీలపై విజయంతో రికార్డుల మోత మోగించిన కోహ్లీ సేన..

టీమిండియాకు ఇది స్వదేశంలో వరుసగా 11వ విజయం కాగా 10 విజయాలతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు 11 విజయాలతో భారత్ ఆ రికార్డును అధిగమించగా, 1994-2001, 2004-2008 మధ్య ఆస్ట్రేలియా రెండుసార్లు వరుసగా పది టెస్టు విజయాలు సాధించింది.

news18-telugu
Updated: October 13, 2019, 8:29 PM IST
India vs South Africa: సఫారీలపై విజయంతో రికార్డుల మోత మోగించిన కోహ్లీ సేన..
(BCCI)
  • Share this:
దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కోహ్లీ సేన సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టీమిండియాకు ఇది స్వదేశంలో వరుసగా 11వ విజయం కాగా 10 విజయాలతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు 11 విజయాలతో భారత్ ఆ రికార్డును అధిగమించగా, 1994-2001, 2004-2008 మధ్య ఆస్ట్రేలియా రెండుసార్లు వరుసగా పది టెస్టు విజయాలు సాధించింది. అలాగే కెప్టెన్‌గా టీమిండియాకు జట్టుకు అత్యధిక విజయాలు అందించిన వారి కోహ్లీది మూడోస్థానం. 50 టెస్టులకు కెప్టెన్ గా సారథ్యం వహించిన కోహ్లీ మొత్తం 30 విజయాలు అందించాడు. కాగా ఈ ఘనత సాధించిన వారిలో కోహ్లీ కన్నా ముందు స్టీవా (37 టెస్టు మ్యాచులు) , రికీ పాంటింగ్ (35 టెస్టు మ్యాచులు) ఉన్నారు.

Published by: Krishna Adithya
First published: October 13, 2019, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading