INDIA VS SOUTH AFRICA THIRD TEST DAY 1 LIVE SCORE AND UDPATES TEAM INDIA WON THE TOSS AND OPT TO BAT FIRST SRD
Ind Vs Sa : తెలుగు ప్లేయరంటే మరి ఇంత చిన్న చూపా.. మరోసారి అన్యాయం.. టాస్ టీమిండియాదే..
Ind Vs Sa
Ind Vs Sa : Ind Vs Sa : 29 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ నెగ్గే సువర్ణావకాశం టీమిండియా ముందు ఉంది. రెండు మార్పులతో ఈ మ్యాచులో బరిలోకి దిగింది కోహ్లీసేన.
టీమిండియా, దక్షిణాఫ్రికాల (India Vs South Africa) మధ్య సిరీస్ ఫలితం తేల్చే నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ కు కేప్ టౌన్ ఆతిథ్యమిస్తోంది. ఈ సిరీస్ లో సెంచురియన్ లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా(Team India) 113 పరుగుల తేడాతో గెలిచింది. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ 1-1తో సమం చేసింది. దీంతో.. ఇప్పుడందరి దృష్టి మూడో టెస్టుపై పడింది. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టులో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. గాయం నుంచి కోలుకున్న విరాట్ కోహ్లీ.. హనుమ విహారీ స్థానంలో చోటు దక్కించుకోగా.. సిరాజ్ స్థానంలో ఉమేష్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు, సౌతాఫ్రికా ఎటువంటి మార్పుల్లేకుండా విన్నింగ్ కాంబినేషన్ తో నే బరిలోకి దిగుతోంది.
టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచులో మరోసారి ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. ఈ ఇద్దరి మంచి ఫామ్ లో ఉన్నారు. కేఎల్ రాహుల్ భారీ ఇన్నింగ్స్ లు ఆడుతుంటే.. మయాంక్ వచ్చిన ఆరంభాల్ని భారీ ఇన్నింగ్స్ లుగా మలచడంలో విఫలమవుతున్నాడు. మయాంక్ అగర్వాల్ ఈ లోపంపై దృష్టి పెట్టాలి. ఇక, రెండో టెస్ట్ కు వెన్ను నొప్పి గాయంతో దూరమైన విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రావడంతో టీమిండియా బ్యాటింగ్ బలోపేతం కానుంది. అయితే, తెలుగు ప్లేయర్ హనుమ విహారీపై వేటు పడటం అన్యాయమే అని చెప్పాలి. రెండో టెస్టులో మంచి ప్రదర్శన చేసినా అతని తప్పించింది టీమిండియా మేనేజ్ మెంట్.
🚨 Toss Update from Cape Town 🚨
Virat Kohli has won the toss & #TeamIndia have elected to bat against South Africa in the third #SAvIND Test.
ఇక, రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఫామ్ లోకి వచ్చిన పుజారా, రహానేలు ఈ మ్యాచులో సత్తా చాటాల్సిందే. ఈ సీనియర్ ప్లేయర్లకు ఇదే లాస్ట్ ఛాన్స్. వీరిద్దరూ సెంచరీలు బాదకపోతే.. తర్వాత సిరీస్ ల్లో టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమేనని అభిప్రాయం వినపడుతోంది.
A look at #TeamIndia's Playing XI for the third Test 🔽
రిషబ్ పంత్ కూడా ఈ సిరీస్ లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స ఆడలేదు. దూకుడుగా ఆడి వికెట్ ను పారేసుకుంటున్నారు. ఈ యంగ్ వికెట్ కీపర్ కూడా సత్తా చాటాల్సిందే. ఇక, బుమ్రా, షమీ, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ లు బౌలింగ్ లో కీ రోల్ ప్లే చేయనున్నారు. షమీ, బుమ్రాలు కొత్త బంతితో అద్భుతాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక, టీమిండియా బ్యాటింగ్ కు రబాడా, ఓలివర్, ఎంగిడి ల నుంచి ప్రమాదం ఉంది. సౌతాఫ్రికాలో చరిత్ర సృష్టించాలంటే.. ఈ స్ట్రాంగ్ బౌలంగ్ లైనప్ ను సమర్ధవంతగా ఎదుర్కోవాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.