IND vs SA : దెబ్బకి దెబ్బ తీసిన టీమిండియా..చితక్కొట్టిన స్మృతి మంధనా..చెలరేగిన జులన్ గోస్వామి..

IND vs SA (ఫైల్ ఫోటో)

IND vs SA : దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో ఫస్ట్ వన్డేలో ఓడిపోయిన టీమిండియా దెబ్బకు దెబ్బకి తీసింది. రెండో వన్డేలో సూపర్ విక్టరీ కొట్టి టీమిండియా బోణి కొట్టింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది మిథాలీ రాజ్ సేన.

  • Share this:
    దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో ఫస్ట్ వన్డేలో ఓడిపోయిన టీమిండియా దెబ్బకు దెబ్బకి తీసింది. రెండో వన్డేలో సూపర్ విక్టరీ కొట్టి టీమిండియా బోణి కొట్టింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది మిథాలీ రాజ్ సేన. అన్ని విభాగాల్లో మిథాలీసేన ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. సౌతాఫ్రికా టీమ్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని భారత టీమ్ కేవలం 28.4 ఓవర్లలో వికెట్​ నష్టపోయి ఛేదించింది. దీనితో, ఇరు జట్ల మధ్య 5 వన్డే సిరీస్ ఇప్పుడు మరోసారి సమానంగా ఉంది. మొదటి 2 మ్యాచ్‌ల తరువాత, ఇరు జట్ల మధ్య సిరీస్ 1-1తో సమానంగా ఉంది.టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా.. టీమిండియా బౌలర్లు జులన్‌ గోస్వామి (4/42), గైక్వాడ్‌ (3/37), మాన్సీ జోషి (2/23) ధాటికి 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో లారా గుడాల్‌(49) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

    తర్వాత ఈజీ టార్గెట్ ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన భారత్‌.. కేవలం 28.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకొని సునాయాస విజయాన్ని సాధించింది. ఓపెనర్ జేమిమా రోడ్రిగ్స్ (‌20 బంతుల్లో 9) విఫలమైనప్పటికీ, మరో ఓపెనర్‌ మంధన ( 64 బంతుల్లో 80 పరుగులు;10 ఫోర్లు, 3 సిక్స్‌లు), వన్‌ డౌన్‌ బ్యాటర్‌ పూనమ్‌ రౌత్‌లు ( 89 బంతుల్లో 62 పరుగులు; 8 ఫోర్లు)‌ భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి 5 వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టింది. 4 వికెట్లతో రాణించిన జులన్‌ గోస్వామి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైంది.
    Published by:Sridhar Reddy
    First published: