IND vs SA | రాంచీ టెస్ట్ రెండో రోజు.. భారత్ డిక్లేర్డ్... సౌతాఫ్రికా 9/2

టెస్టులు, వన్డేల్లోనూ డబుల్ సెంచరీ సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. 255 బంతుల్లో 212 పరుగులు చేశాడు

news18-telugu
Updated: October 20, 2019, 4:35 PM IST
IND vs SA | రాంచీ టెస్ట్ రెండో రోజు.. భారత్ డిక్లేర్డ్... సౌతాఫ్రికా 9/2
భారత్, సౌతాఫ్రికా టెస్ట్
  • Share this:
రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. సరిగా వెలుతురు లేకపోవడంతో ఈ రోజు మ్యాచ్‌ను 20 నిమిషాల ముందే ముగించారు. మ్యాచ్ ముగిసే సమయానికి సౌతాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది. హజ్మా (0), డుప్లెసిస్ (1) క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌ను 497/9 పరుగులకు డిక్లేర్ చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టులో ఓపెనర్ డీన్ ఎల్గర్‌ను షమి ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్‌లో డీకాక్‌ను ఉమేష్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. అంతకు ముందు రోహిత్ శర్మ టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. అజింక్యా రహానే తన 11వ టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పటిష్టమైన స్కోర్ సాధించింది.

టెస్టుల్లో ఓపెనర్‌గా రావడం మొదలు పెట్టిన తొలి సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ప్రతిభ చూపుతున్నాడు. టెస్టులు, వన్డేల్లోనూ డబుల్ సెంచరీ సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. 255 బంతుల్లో 212 పరుగులు చేశాడు రోహిత్. అందులో 28 ఫోర్లు, ఆరు సిక్స్‌లు ఉన్నాయి.

బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోదీ
Published by: Ashok Kumar Bonepalli
First published: October 20, 2019, 4:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading