IND vs SA: రిషబ్ పంత్‌పై వేటు.. తుది జట్టులో సాహాకు దక్కిన చోటు

రేపటి నుంచి విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ సందర్భంగా పంత్‌పై జట్టు యాజమాన్యం వేటు వేసింది. కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. సాహాకు తుది జట్టుతో చోటు దక్కుతుందని తెలిపాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 1, 2019, 2:42 PM IST
IND vs SA: రిషబ్ పంత్‌పై వేటు.. తుది జట్టులో సాహాకు దక్కిన చోటు
వృద్ధిమాన్ సాహా
  • Share this:
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని వారసుడు ఎవరు..? వృద్ధిమాన్ సాహానా? లేక రిషబ్ పంత్? వీరిద్దరు కాకుండా వేరొకరా? కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ ఇది. సాహా, రిషబ్ పంత్‌కు బోలెడన్నీ అవకాశాలు వచ్చాయి. వీరిద్దరిలో ఎవ్వరూ కాకుంటే మరెవ్వరు? అంతకుముందు టెస్టుల్లో, వన్డేల్లో పలు అవకాశాలు దక్కించుకున్న సాహా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పంత్ విషయానికి వచ్చే సరికి ప్రపంచకప్ సహా వెస్టిండీస్‌ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లోనూ 4, 19 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో రేపటి నుంచి విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ సందర్భంగా పంత్‌పై జట్టు యాజమాన్యం వేటు వేసింది. కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. సాహాకు తుది జట్టుతో చోటు దక్కుతుందని తెలిపాడు.

మరోవైపు, రవిచంద్రన్ అశ్విన్ కూడా తుది జట్టులో ఉంటాడని కోహ్లీ వెల్లడించాడు. దీంతో తొలి మ్యాచ్‌ తుది జట్టుపై క్లారిటీ వచ్చింది. ఇక, రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

Published by: Shravan Kumar Bommakanti
First published: October 1, 2019, 2:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading