IND vs SA: కేఎల్ రాహుల్‌కు షాక్.. రోహిత్ శర్మకు కొత్త బాధ్యత

వెస్టిండీస్ సిరీస్‌కు 16 మందిని ఎంపిక చేసిన బీసీసీఐ.. దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు మాత్రం 15 మందినే ఎంపిక చేసింది.

news18-telugu
Updated: September 12, 2019, 5:25 PM IST
IND vs SA: కేఎల్ రాహుల్‌కు షాక్.. రోహిత్ శర్మకు కొత్త బాధ్యత
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ
  • Share this:
India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరగున్న టెస్ట్ సిరీస్‌గా భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు సెలెక్టర్లు షాకిచ్చారు. జట్టులో నుంచి అతడిని తప్పించి యువ క్రికెటర్ శుభమాన్ గిల్‌ను తొలిసారి టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు. వెస్టిండీస్ సిరీస్‌కు 16 మందిని ఎంపిక చేసిన బీసీసీఐ.. దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు మాత్రం 15 మందినే ఎంపిక చేసింది. టీమ్‌లో ఉమేశ్ యాదవ్‌కు చోటు కల్పించలేదు. ఈ టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మకు కొత్త బాధ్యతలు అప్పగించారు. మయాంగ్ అగర్వాల్‌తో పాటు ఓపెనింగ్ దిగబోతున్నాడు రోహిత్ శర్మ.

ఇండియా జట్టు: విరాట్ కొహ్లీ (కెప్టెన్), మయాంగ్ అగర్వాల్, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జాస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభమాన్ గిల్.



First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading