Home /News /sports /

INDIA VS SOUTH AFRICA R ASHWIN CAN BREAK KAPIL DEV RECORD MOHAMMED SHAMI AIMS TO JOIN 200 CLUB JNK

IND vs SA: దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్, డేల్ స్టెయిన్ రికార్డులపై అశ్విన్ కన్ను.. మహ్మద్ షమీకి అరుదైన అవకాశం

కపిల్ దేవ్ రికార్డుపై కన్నేసిన రవిచంద్రన్ అశ్విన్ (PC: BCCI)

కపిల్ దేవ్ రికార్డుపై కన్నేసిన రవిచంద్రన్ అశ్విన్ (PC: BCCI)

India vs South Africa: దక్షిణాఫ్రికా పర్యటనలో రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీలు వికెట్ల పరంగా పెద్ద ఘనతలు సాధించడానికి సిద్దంగా ఉన్నారు. డిసెంబర్ 26 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఈ పర్యటనలో భాగం కాదు. దీంతో భారమంతా అశ్విన్ పైనే ఉన్నది. ఈ సమయంలో అశ్విన్ భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ రికార్డును అధిగమించవచ్చు. మరోవైపు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన 'డబుల్ సెంచరీ'కి కేవలం 5 అడుగుల దూరంలో ఉన్నాడు.

ఇంకా చదవండి ...
  దక్షిణాఫ్రికాలో (IND vs SA) మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు (Team India) పర్యటనకు వెళ్లింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) సారథ్యంలోని టీమ్ ఇండియా డిసెంబర్ 26న సెంచూరియన్ టెస్టుతో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ టెస్టు సిరీస్‌లో భారత ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin), ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ (Mohammad Shami) కొన్ని రికార్డులపై కన్నేశారు. రవిచంద్రన్ అశ్విన్ గత కొంత కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఐపీఎల్ 2021, T20 ప్రపంచ కప్, న్యూజిలాండ్ సిరీస్‌లలో అద్భుతంగా బౌలింగ్ చేసాడు. అశ్విన్ ఇటీవలే హర్భజన్ సింగ్‌ రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం భారత జట్టు నుండి అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్‌గా మూడవ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

  దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను అధిగమించే అవకాశం అశ్విన్‌కి ఇప్పుడు లభించింది. అశ్విన్ ఇప్పటి వరకు 427 టెస్టు వికెట్లు తీశాడు. భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434) మాత్రమే అతని కంటే ముందున్నారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన వెంటనే దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్‌ను అశ్విన్ అధిగమించనున్నాడు. టెస్టు క్రికెట్‌లో 439 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను కూడా అశ్విన్ అధిగమించే అవకాశం ఉంది.

  IPL 2022: మెగా వేలానికి 1000 మంది ఆటగాళ్లు.. కానీ కొనుగోలు చేసేది ఎంత మందినో తెలుసా?
  అశ్విన్ సహచర బౌలర్ మహమ్మద్ షమీ కూడా టెస్టు క్రికెట్‌లో 200 వికెట్లకు కేవలం 5 అడుగుల దూరంలో ఉన్నాడు. టీమ్ ఇండియా తరఫున షమీ ఇప్పటివరకు 54 టెస్టు మ్యాచ్‌లు ఆడి 195 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జవగల్ శ్రీనాథ్ మాత్రమే టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరఫున 200కి పైగా వికెట్లు పడగొట్టిన పేసర్లుగా రికార్డు సృష్టించారు.

  Trent Boult: ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాలి.. అక్కడ ఉన్నది ట్రెంట్ బౌల్ట్.. ఆఖరుకు ఏమయ్యిందంటే..
  విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టుకు ఈసారి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకునే సువర్ణావకాశం వచ్చింది. ఇప్పటి వరకు విదేశాల్లో టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలవని ఏకైక జట్టు దక్షిణాఫ్రికా. ఇప్పటివరకు ఏడుసార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఆరుసార్లు ఓటమిని చవిచూసింది. 2010-11 సంవత్సరంలో తొలిసారిగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆఫ్రికన్ గడ్డపై టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడంలో భారత జట్టు విజయం సాధించింది. మూడేళ్ల క్రితం కోహ్లీ కెప్టెన్సీలో భారత్ చివరిసారిగా ఆఫ్రికాలో పర్యటించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:John Kora
  First published:

  Tags: India vs South Africa, Kapil Dev, Mohammed Shami, Ravichandran Ashwin, Test Cricket, Virat kohli

  తదుపరి వార్తలు