India vs South Africa: ధోనీకి షాక్..ట్వీ20 జట్టులో దక్కని చోటు

సెప్టెంబరు 15 నుంచి సౌతాఫ్రికా-ఇండియా సిరీస్ స్వదేశంలో జరగనుంది. తొలి మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది.

news18-telugu
Updated: August 29, 2019, 10:38 PM IST
India vs South Africa: ధోనీకి షాక్..ట్వీ20 జట్టులో దక్కని చోటు
ఎంఎస్ ధోనీ, విరాట్ కొహ్లీ
news18-telugu
Updated: August 29, 2019, 10:38 PM IST
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బీసీసీఐ సెలెక్టర్లు షాకిచ్చారు. సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు ధోనీని ఎంపిక చేయలేదు. గురువారం సెలక్షన్ కమిటీ సమావేశమై సౌతాఫ్రికాతో ఆడబోయే భారత జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టులో ధోనీకి చోటు దక్కలేదు. వెస్టిండీస్‌తో ట్వీ20 సిరీస్ ఆడిన జట్టులో ఒకే ఒక్క మార్పుచేశారు. భువనేశ్వర్ కుమార్‌ స్థానంలో ఆల్‌రౌండ్ హార్ధిక్ పాండ్యాను జట్టులోకి తీసుకున్నారు. జట్టు కెప్టెన్‌గా విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉంటారు. కాగా, సెప్టెంబరు 15 నుంచి సౌతాఫ్రికా-ఇండియా సిరీస్ స్వదేశంలో జరగనుంది. తొలి మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది.

టీ20 జట్టు:  విరాట్ కొహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవ్‌దీప్ సైని.

వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ సిరీస్‌కు ఎంఎస్ ధోనీ దూరంగా ఉన్నాడు. టెరిటోరియల్ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న ధోనీ కొన్ని రోజుల పాటు కశ్మీర్‌లో సైనిక విధులు నిర్వహించాడు. పారా మిలిటరీలోని 106టీఏ బెటాలియన్‌‌తో కలిసి డ్యూటీ చేశాడు. ఆయుధాలకు సంబంధించి, యుద్ధ పరికరాల అంశాల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ట్రైనింగ్ పూర్తవడంతో ఇటీవలే స్వస్థలానికి వెళ్లాడు ధోనీ. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌లో ధోనీ ఆడతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అతడిని జట్టులోకి తీసుకోలేదు సెలెక్టర్లు

First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...