విజయానికి రెండు వికెట్ల దూరంలో భారత్...బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన సౌతాఫ్రికా

మూడో టెస్టు మ్యాచులో కోహ్లీ సేన భారీ విజయం నమోదుకు మరో రెండు వికెట్ల దూరంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైన తర్వాత, ఫాలో ఆన్ ఆడుతున్న సౌతాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

news18-telugu
Updated: October 21, 2019, 6:01 PM IST
విజయానికి రెండు వికెట్ల దూరంలో భారత్...బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన సౌతాఫ్రికా
వికెట్ తీసన ఆనందంలో టీమిండియా ఆటగాళ్లు
  • Share this:
రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో కోహ్లీ సేన భారీ విజయం నమోదుకు మరో రెండు వికెట్ల దూరంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైన తర్వాత, ఫాలో ఆన్ ఆడుతున్న సౌతాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 8 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది. దీంతో భారత్ గెలుపునకు రెండు వికెట్ల దూరంలో నిలిచింది. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో చెలరేగిన భారత బౌలర్లు, రెండో ఇన్నింగ్స్‌లోనూ సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో మెరిసిన హమ్జాను షమీ డకౌట్ చేయగా, అదే ఊపుతో కెప్టెన్ డుప్లెసిస్ (4), బవుమా (0)లను పెవిలియన్ పంపాడు. మరోవైపు, ఉమేశ్ కూడా సఫారీ బ్యాట్స్‌మెన్‌ను దెబ్బకొట్టాడు. డికాక్ (5), వికెట్ కీపర్ క్లాసెన్ (5)లను అవుట్ చేశాడు. ఓపెనర్ ఎల్గర్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఉమేశ్‌, షమి, అశ్విన్‌, జడ్డూ, నదీమ్‌ బంతితో విజృంభించడంతో దక్షిణాఫ్రికా ఒకే రోజు 16 వికెట్లు చేజార్చుకుంది.
First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading