India vs South Africa: పుణె టెస్టులో విరాట్ కొహ్లీ డబుల్ సెంచరీ

India vs South Africa: కెరీర్‌లో ఏడో డబుల్ సెంచరీ నమోదు చేశాడు కొహ్లీ. వీటిలో ఆరు డబుల్ సెంచరీలు భారత్‌‌లోనే సాధించడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో 7వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు కొహ్లీ.

news18-telugu
Updated: October 11, 2019, 3:05 PM IST
India vs South Africa: పుణె టెస్టులో విరాట్ కొహ్లీ డబుల్ సెంచరీ
విరాట్ కొహ్లీ
  • Share this:
India vs South Africa: పుణె టెస్టులో కెప్టెన్ విరాట్ కొహ్లీ దూకుడు కొనసాగుతోంది. టీ బ్రేక్ తర్వాత డబుల్ సెంచరీ చేసి సత్తా చాటిన కొహ్లీ... కెరీర్‌లో ఏడో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. వీటిలో ఆరు డబుల్ సెంచరీలు భారత్‌‌లోనే సాధించడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో 7వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు కొహ్లీ. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 500 పరుగుల మార్కును అందుకుంది. క్రీజులో కొహ్లీ, జడేజా నిలకడగా ఆడుతున్నారు.

కొహ్లీ డబుల్ సెంచరీలు





















































జట్టు సంవత్సరంవేదిక పరుగులు
శ్రీలంక 2017 ఢిల్లీ 243
ఇంగ్లండ్ 2016 ముంబై 235
శ్రీలంక 2017 నాగపూర్ 213
న్యూజిలాండ్ 2016 ఇండోర్ 211
బంగ్లాదేశ్ 2016 హైదరాబాద్ 204
వెస్టిండీస్ 2016 నార్త్ సౌండ్ 200
సౌతాఫ్రికా 2019 పుణె 200 *

ఇక అత్యధిక టెస్ట్ డబుల్ సెంచరీలు చేసిన వారిలో కొహ్లీ (7) నాలుగో స్థానంలో ఉన్నాడు. 12 డబుల్ సెంచరీలతో డాన్ బ్రాడ్‌మన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక 11 డబుల్ సెంచరీలతో సంగక్కర రెండో స్థానం, 9 డబుల్ సెంచరీలతో బ్రియలాన్ లారా మూడో స్థానంలో ఉన్నారు. కొహ్లీతో పాటు వ్యాలీ హ్యామండ్, జయవర్దనే 7 డబుల్ సెంచరీలు చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: October 11, 2019, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading