India vs South Africa: కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రసక్తే లేదు...దక్షిణాఫ్రికా కెప్టెన్ సంచలన ప్రకటన...

India vs South Africa: కరోనాపై దూరంగా ఉండేందుకు తమ జట్టు సభ్యులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని దక్షిణాఫ్రికా క్రికెట్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ తెలిపాడు.

news18-telugu
Updated: March 9, 2020, 10:25 PM IST
India vs South Africa: కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రసక్తే లేదు...దక్షిణాఫ్రికా కెప్టెన్ సంచలన ప్రకటన...
మార్క్ బౌచర్
  • Share this:
కరోనా వైరస్ ప్రభావం క్రికెట్ పైన కూడా పడింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించనుంది. అయితే కరోనాపై దూరంగా ఉండేందుకు తమ జట్టు సభ్యులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని దక్షిణాఫ్రికా క్రికెట్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ తెలిపాడు. అంతేకాదు కోహ్లీతో సహా టీమిండియా ప్లేయర్లు ఎవరితోనూ షేక్ హ్యాండ్ చేయమని వెల్లడించాడు. ప్రస్తుతం వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండడంతో షేక్ హ్యాండ్ చేయకపోవడమే మంచిదని మేము భావిస్తున్నాం. మాకు భద్రతా సిబ్బంది ఉన్నారు. వారి సలహాలు, సూచనల మేరకు మేము ముందుకు వెళ్తామని బౌచర్‌ తెలిపాడు. దక్షిణాఫ్రికా నుంచి భారత్ కి బయలుదేరే క్రమంలో మీడియాతో మాట్లాడిన బౌచర్‌ ఈ విషయాలను వెల్లడించాడు. ఇక ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మార్చి 12న తొలి వన్డే, లఖ్‌నవూ వేదికగా మార్చి 15న రెండో వన్డే, కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో మార్చి 18న ఆఖరి వన్డే ఆడనుంది. అన్ని మ్యాచ్ లు భారత కాలమాన ప్రకారం 1.30 గంటలకు మొదలవుతుంది.

భారత జట్టు :

శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, మనీష్‌ పాండే, శ్రేయస్ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌

దక్షిణాఫ్రికా జట్టు :
ఆండిలే ఫెహ్లుక్వాయో, అన్రిచ్ నార్ట్జే, బ్యూరాన్ హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లెర్, ఫాఫ్ డు ప్లెసిస్, జార్జ్ లిండే, హెన్రిచ్ క్లాసేన్, జన్నెమాన్ మలన్, జోన్-జోన్ స్మట్స్, కేశవ్ మహారాజ్, కైల్ వెర్రిన్నే, లుంగీ ఎన్గిడి, లూథో సిపమ్లా, రాస్సీ వాన్ డెర్బా బస్
Published by: Krishna Adithya
First published: March 9, 2020, 10:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading