IND vs SA: కష్టాల్లో దక్షిణాఫ్రికా.. పట్టు బిగిస్తున్న టీమిండియా..

విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతూ పరుగులు చేయడానికి కూడా వీల్లేకుండా కట్టడి చేస్తోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 4, 2019, 10:27 AM IST
IND vs SA: కష్టాల్లో దక్షిణాఫ్రికా.. పట్టు బిగిస్తున్న టీమిండియా..
పట్టు బిగిస్తున్న టీమిండియా
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 4, 2019, 10:27 AM IST
విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతూ పరుగులు చేయడానికి కూడా వీల్లేకుండా కట్టడి చేస్తోంది. ప్రస్తుతానికి సఫారీలు 4 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు, జడేజా, ఇషాంత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ జోరు కొనసాగించిన విషయం తెలిసిందే. మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో కదం తొక్కగా, 7 వికెట్ల నష్టానికి 502 పరుగులు దగ్గర డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. ఆ జట్టు కేవలం 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 39 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఇషాంత్ శర్మ ఒక అద్భుత డెలివరీతో బవుమాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. క్రీజులో డీన్ ఎల్గర్(37), డుప్లెసిస్(12) ఉన్నారు.

దక్షిణాఫ్రికా స్కోర్ కార్డు: ఇన్నింగ్స్-1 (81/4)
డీన్ ఎల్గర్ 37*, మక్రం 4, బ్రూన్ 4, డేన్ పీడ్త్‌ డకౌట్, బవుమా 18, డుప్లెసిస్ 12*

అశ్విన్ 30/2, జడేజా 21/1, ఇషాంత్ 24/1



టీమిండియా స్కోర్ కార్డు: ఇన్నింగ్స్-1 (502/7 డిక్లేర్డ్)
రోహిత్ శర్మ 176, మయాంక్ అగర్వాల్ 215, పుజారా 6, కోహ్లి 20, రహానే 15, విహారి 10, వృద్ధిమాన్‌ సాహా 21, రవిచంద్రన్ అశ్విన్ 1*, జడేజా 30*
కేశవ్‌ మహరాజ్‌ 189/3, ఫిలాండర్‌ 68/1, డేన్‌ పీడ్త్‌ 107/1, ముత్తుస్వామి 63/1,డీన్‌ ఎల్గర్‌ 4/1
First published: October 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...